అనారోగ్యశ్రీగా మార్చొద్దు
‘‘కోట్లాది మందికి అండగా ప్రాణాలు పోసే అపర సంజీవనిగా పేరుపొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి అనారోగ్యశ్రీగా మార్చొద్దు.
‘ఆరోగ్యశ్రీ’పై సీఎం చంద్రబాబుకు విపక్ష నేత వైఎస్ జగన్ లేఖ
- తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి లేదంటే 9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- కావాలనే చేస్తున్నారా.. మీ అసమర్థతా.. తేలాలి..
- పేదలకు వైద్యం అందించలేకపోతే ఏం ఉపయోగం?
- సంజీవని లాంటి పథకానికి మీరు పాడెకడుతున్నారు
- కమీషన్లు రావడం లేదనే కేటారుుంపుల్లో కోతలు
- ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి కాసుల సేద్యం చేస్తారా?
- డయాలసిస్ అవసరమైన పేషెంట్లు ఎలా బతకాలి?
- విద్య, వైద్యం కోసం పొలాలు అమ్ముకుంటున్నారు
- మీ పుణ్యాన సంక్షేమ పథకాలన్నిటికీ దుర్గతి
సాక్షి, హైదరాబాద్ : ‘‘కోట్లాది మందికి అండగా ప్రాణాలు పోసే అపర సంజీవనిగా పేరుపొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి అనారోగ్యశ్రీగా మార్చొద్దు. మహత్తర లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకానికి తూట్లు పొడవద్దు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకుని దిదు ్దబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆరోగ్యశ్రీ రోగులను, లేదా వారి బంధువులను కలుపుకొని వైఎస్సార్‌సీపీ తరఫున ధర్నాలకు దిగుతామని జగన్ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదనతో చంద్రబాబుకు శనివారం ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేసిన కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులు చేయనందుకు ఈ పథకం నీరు గారుతోందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు. తమ దగ్గర నిధులు లేవని, వైద్యం చేస్తే చేయండి లేకుంటే ఆపేయండని సాక్షాత్తూ ఆరోగ్యశాఖా మంత్రి చెప్పడం దారుణమని జగన్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి సరిగ్గా అమలు కాక పోతుండటంతో వైద్యం, విద్య కోసం పేదలు తమ పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్ప డిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చినందుకు సంతోషమేనని అరుుతే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు బాబు ప్రభుత్వం అందించిన ‘సేవలు’ మాదిరిగా ఈ పథకానికి కూడా పాడె కడుతున్నారనే తమకు ఆందోళనగా ఉందని జగన్ పేర్కొన్నారు. బహిరంగ లేఖ వివరాలిలా...
తేల్చాల్సిన సమయం వచ్చింది..
‘‘కరెన్సీ సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేస్తోంది. కరువు మొత్తంగా 13 జిల్లాల్లో, ప్రత్యేకించి రాయలసీమలో విలయ తాండవం చేస్తోంది. పాలన పేరిట మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఏ ఒక్క సామాజిక వర్గం గానీ, ఏ ఒక్క పల్లె, ఏ ఒక్క పట్టణంలో నివసిస్తున్న మనిషిగానీ భరోసాగా లేరు. పరిశ్రమలు, పోర్టుల పేరు చెప్పి వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని మీకు కావాల్సిన వారికి కట్టబెట్టే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా సాగిస్తున్నారు. బందరు పోర్టు పేరిట మీరు చేస్తున్న దురాగతాలు ఏ స్థ్ధారుులో ఉన్నాయన్నది ఈ నెల1న అక్కడి పల్లెల్లో పర్యటించి నేను స్వయానా తెలుసుకున్నాను. మీ పాలనలో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నదీ వారి మాటల్లోనే వినండి.
ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి అమలు కాక, చదువుల కోసం వైద్యం కోసం పొలాలు అమ్ముకోవా ల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ పొలాలు అమ్ముదామన్నా, అమ్ముకునే వీలు లేకుండా రిజిస్ట్రేషన్లు బంద్ చేసి వారి నుంచి బలవంతంగా లాక్కుంటున్నా రని బాధితులు చెప్పటం నా మనసును కలచివేసింది. ఇదేం దుర్మార్గం చంద్ర బాబుగారూ? వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమై న పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ గ్రామ గ్రామానా ఇంటింటా వచ్చాయంటే ఎంతటి దిక్కుమాలిన పాలన చేస్తున్నారు మీరు? నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు అధ్వానంగా ఉందన్న బుద్ధీ జ్ఞానం తమకు ఏ కోశానా లేకుండా ఎలా పోరుుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వండి. రాష్ట్రంలో పేదలకు, ఆర్థికంగా అశక్తులకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని మీరు ఒక పథకం ప్రకారం బలహీనపరుస్తున్నారా, లేక మీ అసమర్థత వల్ల ప్రాణాలు పోసే ఆ పథకం బలహీనపడిందా అన్నది తేల్చాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
సంజీవనిలాంటి పథకానికి పాడెకడతారా?
ముఖ్యమంత్రిగారూ.. మహానేత డాక్టర్ వైఎస్సార్‌గారి పథకమైన ఆరోగ్యశ్రీని మీరు అధికారంలోకి వచ్చిన తరవాత ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మార్చారు. సంతోషం! మా బాధ, భయం ఏమిటంటే.. ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో తమరు ఎలాంటి ‘అమూల్యమైన సేవ’లు అందించారో ఈ పథకానికి కూడా అలాంటి సేవలే అందించి, కోట్ల ప్రజలకు సంజీవని అరుున పథకానికి పాడె కడుతున్నారన్నదే మా ఆందోళన. ఈ పథకానికి నిధుల అవసరం ఎంత? మీరు చేసిన కేటారుుంపు ఎంత అన్నది మరోసారి ప్రజల ముందు ఉంచుతున్నాను, 2016-17కు సంబంధించి కనీసంగా రూ.910.77 కోట్లు కావాలి అని సంబంధిత విభాగం అణాపైసలతో సహా లెక్కగట్టి మీ ముందు పెడితే, నడుస్తున్న ఆర్ధిక సంవత్సరానికి మీ ప్రభుత్వం కేటారుుంచినది ఎంత? రూ.568.23 కోట్లు! ఎక్కడ రూ.910 కోట్లు? ఎక్కడి 568 కోట్లు? మీరు మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేనాటికి ఆరోగ్యశ్రీ బకారుులు ఏకంగా రూ.395.69 కోట్లు. బకారుులు పోతే నికరంగా కేటారుుంపులు ఎంత? ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1 కోటీ 30 లక్షల కుటుంబాలకు ఈ కేటారుుంపులతో ఏ కొంచెం అరుునా న్యాయం జరిగే వీలుందా? ఈ విషయం మీద బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అభ్యంతరం లేవనెత్తాం. అది నిజమేనని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ఈ రోజు ఆరోగ్యశ్రీ అమలు దాదాపుగా పడక వేస్తున్న వైనంతో నిరూపణ అవుతోంది.
కమీషన్లు రావడం లేదనే ఆరోగ్యశ్రీకి కోతలు
ఏమిటిది ముఖ్యమంత్రిగారూ..? మీ జేబులు, మీ మనీ డంపులు నింపుకునే పథకాలకు అవసరం లేకపోరుునా అదనపు కేటారుుంపులా? కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో అవసరం లేకపోరుునా, ఎవరూ అడగకపోరుునా జీవోల ద్వారా ఎస్కలేషన్లా? కమీషన్లు కొట్టేందుకు వీలుగా పట్టిసీమలో 21.5 శాతం అదనపు చెల్లింపులా? కమీషన్లు రావటం లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ బడ్జెట్‌లో దాదాపు 50 శాతం కోతలా? ఏం సందేశం ఇస్తున్నారు చంద్రబాబుగారూ? ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా, కాంట్రాక్టుల నుంచి రాజధాని భూముల కొనుగోళ్ల వరకు, సదావర్తి భూముల మొదలు గుడిని గుడిలో లింగాన్ని మింగే పనుల వరకు మీరు చేయని దుర్మార్గం ఏదన్నా ఉందా చంద్రబాబు గారూ? రైతు, కూలి, సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు సవ్యంగా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అందుకోలేని పరిస్థితుల్లోకి రాష్ట్రంలో పరిపాలన చేరుకోవటానికి కారణం మీ దృష్టి అంతా అవినీతి- మరింత అవినీతి- తిరుగులేని అవినీతి అనే మూడు అంశాల చుట్టూ మాత్రమే పరిభ్రమించటం కాదా?
పేదలకు వైద్యం అందించలేని ప్రభుత్వం..
కావాల్సిన నిధులు కేటారుుంచకుండా ఆసుపత్రుల్లో చికిత్సలు ఎలా సాధ్యం? గుండె జబ్బులు, మల్టిపుల్ ఫ్రాక్చర్లు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు.. ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న రోగుల పరిస్థితి చూడండి! నెట్‌వర్క్ ఆసుపత్రులకు మీరు చెల్లించాల్సిన బిల్లులు గత ఆరు నుంచి తొమ్మిది నెలలుగా చెల్లించకపోవడం వల్ల.. రోగులకు చికిత్స చేయటానికి వారు నిరాకరిస్తున్నారు. ‘‘మా దగ్గర నిధులు లేవు.. ఇష్టమైతేనే చేయండి..లేదంటే మానేయండి’’ అని సాక్షాత్తు ఆరోగ్యమంత్రి కుండబద్దలుకొట్టిన దుర్మార్గమైన పరిస్థితిలో మొత్తంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం సర్వనాశనం చేసింది. బకారుుల చెల్లింపు విషయంలో మీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులు ఈమధ్యే వెల్లడించారు. 500 కోట్లకు పైగా బకారుులు ఉన్నాయని.. అవి చెల్లించని పక్షంలో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చేవరకు పరిస్థితిని మీ ప్రభుత్వం విజయవంతంగా దిగజార్చింది. పేదలకు సకాలంలో వైద్యం అందించలేని మీ ప్రభుత్వం వల్ల ఎవరికి ప్రయోజనం ముఖ్యమంత్రిగారూ!
ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి కాసుల సేద్యం..
వారానికి ఒకసారో, రెండుసార్లో రక్తశుద్ధి చేసుకుంటే తప్ప బతికేందుకు అవకాశాలు లేని పేషెంట్లకు డయాలసిస్ అపారుుంట్‌మెంట్ కావాలంటే ఏడాది తరవాత గానీ ఇవ్వలేం అని ఆ సదుపాయం ఉన్న ఆసుపత్రుల నుంచి సమాధానం వస్తోంది. ఇదే విషయాన్ని నేను అనేక బహిరంగ సభల్లో వివరించి చెప్పాను, వారానికి రెండు సార్లు డయాలసిస్ కావాల్సిన పేషెంట్ ఒక్కో దఫా రూ.3,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. నెలకు రూ 24,000, ఏడాదికి రూ 3,12,000 చెల్లించు కోవాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యశ్రీ ఉండి ఏం లాభం? అంత డబ్బు చెల్లించుకోగల సామర్థ్ధ్యం లేని రోగులే అత్యధికంగా ఉంటారు. వారు ఎలా బతకాలి? నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బకారుులు చెల్లించకపోవటం వల్లే పరిస్థితి ఇంతగా దిగజారిపోరుుంది. దాన్ని సరిదిద్దకుండా మీరు తూతూ మంత్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదో పది డయాలసిస్ కేంద్రాలు అదనంగా పెట్టటం వల్ల ఒనగూడేది లేదు. క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన కీమో థెరపీతో కూడిన వైద్యాన్నే చూడండి.. క్యాన్సర్‌కు వైద్యం చేయటానికి ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం తరఫున మీరు చాలీ చాలని కేటారుుంపులకు పరిమితం అయ్యారు. తెర వెనుక డీల్స్‌లో భాగంగా చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నుంచి మొదలు అన్ని వైద్య సేవల్ని కూడా ప్రైవేటు పరం చేసి, డాక్టర్‌కు టార్గెట్లు పెట్టి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి కాసుల సేద్యం చేసుకుంటున్నారు.
మీ చలవతో దైవాధీనంగా 108..
ఇలాంటి అంశాలమీద మీకు మానవత్వంతో కూడిన ఆలోచనే ఉండదా? పేదల్ని, సామాన్యుల్ని, అభాగ్యుల్ని బతికించే ఆలోచనలే మీకు రావా? ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104..108, 48 లక్షల ఇళ్ళ నిర్మాణం, ఎస్సీ ఎస్టీ వర్గాలకు భూముల పంపిణీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. ఇలా వైఎస్సార్‌గారి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక్కో సువర్ణాధ్యాయం. మీ పాలన పుణ్యాన ఆ పథకాలన్నింటికీ దుర్గతి పడుతోంది. ఫలితంగా పేదవాడికి భరోసాయేపోతోంది. ఒకప్పుడు 108 వాహనానికి ఫోన్ చేస్తే.. నిమిషాల్లోనే వచ్చేది. ఇప్పుడు అదే 108 మీ చలవతో దైవాధీనం సర్వీసుగా మారింది.
దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే ఉద్యమమే..
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని మీరు పేరు మార్చిన ఆరోగ్యశ్రీలో అర్హులకు జరుగుతున్న అవమానాల మీద.. రకరకాల వ్యాధులతో, ఆరోగ్య సమస్యలతో వస్తున్న ప్రజలకు ఆసుపత్రులు మొండి చేరుు చూపుతుండటం మీద మీకు కించిత్తు కూడా బాధ కలగటం లేదా? తెల్ల కార్డు ఉండి కూడా కార్పొరేట్ వైద్యం ఎక్కడా అందక ప్రజలు పడుతున్న అవస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రద్ధ చూపాలి. నిధుల విడుదల విషయంలో ఎలాంటి లోటూ రాదన్న భరోసా ఇవ్వాలి. కుటుంబాలను, ప్రాణాలను నిలబెట్టే ఈ పథకం విషయంలో తక్షణం మీ పద్ధతి మార్చుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో, మీ మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కల్లెక్టరేట్ల ఎదుట ఆరోగ్యశ్రీ రోగులను, లేదా వారి బంధువులను కలుపుకుని మా పార్టీ తరపున ధర్నాలకు దిగుతామని స్పష్టం చేస్తున్నాం.’’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.


