'హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీని స్వాగతిస్తున్నాం' | YSR Congress party MLA Gurunath Reddy takes on JC Diwakar reddy | Sakshi
Sakshi News home page

'హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీని స్వాగతిస్తున్నాం'

Published Sat, Apr 5 2014 1:19 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

'హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీని స్వాగతిస్తున్నాం' - Sakshi

'హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీని స్వాగతిస్తున్నాం'

రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలోని 20కి పైగా ఎంపీ,130కి పైగా ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం హైదరాబాద్లో గుర్నాథరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రూ.50 కోట్లు ఇచ్చి ఆ పార్టీలో చేరారని ఆయన ఆరోపించారు. ఆ విషయం వాస్తవం కాదా అంటూ జేసీ ప్రశ్నించారు.

 

గతంలో చంద్రబాబుని నోటికొట్చినట్లు తిట్టి... ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని టీడీపీలో చేరావంటూ జేసీని గుర్నాథరెడ్డిని విమర్శించారు. హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ పోటీ చేసిన ఆ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని గుర్నాథరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement