
బ్యాంక్ ఖాతాదారులకు వైఎస్సార్‌సీపీ నేత సాయం
హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల వద్ద భారీగా క్యూ లైన్లు ఉండడంతో వృద్ధులు, మహిళల సమస్యలు వర్ణణాతీతంగా మారాయి. దీంతో కొంత మంది దయామయులు క్యూలో నిల్చున్న వారికి తమ వంతు సాయంగా తాగునీరు, టీలు అందజేస్తున్నారు.
శుక్రవారం చైతన్యపురిలోని ఏటీఎంల వద్ద క్యూలైన్లలో ఉన్నవారికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ సాయం అందించారు. నోట్ల రద్దుతో పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి ఫ్రూటీలను అందించారు. ఆయన సాయం చేయడంపై ఖాతాదారులు ధన్యవాదాలు తెలిపారు.