ATM centres
-
ఏటీఎంల కేంద్రంగా భారీ స్కామ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలు కస్టోడియన్లకు ‘కల్పతరువులుగా’ మారుతున్నాయి. వాటిలో నింపాల్సిన నగదును చాకచక్యంగా కాజేస్తున్నారు. ఈ తరహా ఫ్రాడ్స్ తెలుగు రాష్ట్రాల్లో తరచు వెలుగుచూస్తున్నాయి. ఒక్క నగరంలోనే గతంలో రూ. 14.46 కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్‌లో రూ. 2.6 కోట్లు, ఆర్సీఐ సంస్థలో రూ. 9.98 కోట్లు, ట్రాన్స్ ట్రెజర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 1.88 కోట్ల స్కామ్స్ చోటు చేసుకున్నాయి. తాజాగా బీటీఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన రూ. 1.23 కోట్ల స్కామ్ బయటపడింది. ఇలాంటి నేరాలు జరగడానికి వ్యవస్థాగతంగా ఉన్న చిన్న చిన్న లోపాలే కారణమని గుర్తించామని, వాటిని సరిదిద్దు కోవాలని కోరుతూ బ్యాంకులకు లేఖ రాస్తామని పోలీసులు గతంలో ప్రకటించారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకోపోవడం గమనార్హం. ఏపీలోనూ రెండు ఉదంతాలు... హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ. 57 లక్షలు, 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ. 31 లక్షల్ని ఏటీఎం మిషన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు కాజేశారు. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకు మాత్రం సంస్కరణలు పట్టించుకోవట్లేదని స్పష్టమవుతోంది. సీసీఎస్‌లో నమోదైన ‘ఆర్సీఐ’ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర సైతం వెలుగులోకి రావడంతో పోలీసులే ముక్కున వేలేసుకుటున్నారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఆయా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిపే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంది. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి రూ. కోట్లును సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులు ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది ఈ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎంత మేర డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తరవాత ఆయా సంస్థల ఉద్యోగులు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెప్తున్న కస్టోడియన్లు ఏళ్ల పాటు గోల్మాల్ పాల్పడుతూ రూ. లక్షలు, రూ. కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ, చర్యల పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ జరిగిన తరవాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగానే అనేక అంశాల్లో దర్యాప్తు జఠిలంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు అనేక సంస్థాగతమైన లోపాలను గుర్తించారు. ఆ విధానాలు మారాల్సిందే.. ‘ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే అంశాలకు సంబంధించి ఆడిటింగ్ రెగ్యులర్‌గా జరగట్లేదు. మరోపక్క అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్ సైతం ఎప్పుడు, ఏ రూట్లో జరుగుతుంది అనేది కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు తెలిసిపోతోంది. ఈ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. నగదు నింపే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు ఆడిటింగ్ విషయం తెలియకూండా బ్యాంకులు నేరుగా జరపాలి. ఈ తనిఖీలు సైతం నిత్యం, ఆకస్మికంగా జరగాలి. అప్పుడే ‘ఏటీఎం ఫ్రాడ్స్’కు చెక్ చెప్పే ఆస్కారం ఉంటుంది. గతంలో చెప్పినా ఎవురూ పట్టించుకోలేదు. ఈసారి కీలక వివరాలన్నీ పొందుపరుస్తూ బ్యాంకులకు లేఖ రాయాలని భావిస్తున్నాం’ – పోలీసు అధికారులు -
ఏటీఎంలో డబ్బుల్లేవ్ !
చుంచుపల్లి: ఆధునిక సేవలు విస్తరిస్తున్నా అదే తరహాలో వినియోగదారులకు సేవలందించడంలో పలు బ్యాంకులు విఫలమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదును అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలోనే పరిస్థితి ఇలా ఉంటే..మారుమూల ప్రాంతాల పరిస్థితి మరీ అధ్వానం. ప్రధాన ఏటీఎం కేంద్రాలలో రెండు రోజులుగా నగదు కొరత వినియోగదారులను వేధిస్తోంది. పండగ పూట ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దసరాకు చేతిలో డబ్బు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా రోజువారి విత్ డ్రా పరిమితిని ఇటీవల మరింతగా తగ్గించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన సుమారు 25 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 114 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకు సక్రమంగా పనిచేయడం లేదు. దాదాపు 70 శాతం ఏటీఎంలలో నగదు కొరత ఉంది. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయనే కారణంతో చాలా ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచుతున్నారు. ముఖ్యం గా ప్రతినెల మొదటి వారంలో ఏ ఏటీఎంలో చూసినా పనిచేయడం లేదని, ఔట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో వివిధ రకాల ఉద్యోగులు, పింఛన్‌దారులు డబ్బులు డ్రా చేయడానికి నానా తంటాలు పడుతుం టారు. దూర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చేవారి ఇబ్బందులు వర్ణనాతీతం. చాలామంది జేబులో డబ్బులు ఎక్కువగా లేకున్నా.. ఏటీఎం కార్డు ఉందనే ధైర్యంతో బయటకు వెళుతున్నారు. అయితే ఏటీఎం కేంద్రాలు పనిచేయకపోవడంతో చేతిలో డబ్బులు లేక పండగ పూట ఏం చేయాలో.. తెలియక వినియోగదారులు నిరాశకు లోనవుతున్నారు. బ్యాంకుల ఆంక్షలతో అవస్థలు.. ఓ వైపు ఏటీఎంలలో డబ్బులు లేక.. మరోవైపు బ్యాంకుల ఆంక్షలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డు మరో బ్యాంకు ఏటీఎం కేంద్రంలో వినియోగించడానికి పరిమితులను నిర్దేశించారు. నెలలో 3 సార్లు మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా పరిమిత మొత్తంలోనే నగదు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించితే ఫైన్ వసూలు చేస్తున్నారు. ప్రతీ నెలా ఇదే సమస్య ఏర్పడుతోందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులకు చెప్పినా సరైన స్పందన లేదని అంటున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి విత్‌డ్రా పరిమితిని రూ. 20 వేలకు తగ్గించడంతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెపుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదు నిల్వ ఉండేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అన్ని ఏటీఎంలు తిరిగినా ఫలితం లేదు నగదు డ్రా చేయడానికి పట్టణంలోని అన్ని ఏటీఎంల వద్దకు వెళ్లాను. ఎక్కడ చూసినా డబ్బులు లేవు. కొన్ని చోట్ల ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. బ్యాంకు అధికారులు వినియోగదారుల ఇబ్బందులను గ్రహించి నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలి. -ఎం.కోటేశ్వరరావు -
ఇక రాత్రి 11 దాటితే ఏటీఎంలు మూసివేత!
-
రాత్రి 11 దాటితే నో ఏటీఎం!
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయి. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ–లింక్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్ వంటి సైబర్ నేరాలు తగ్గించడానికి డీ–లింక్ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. నిర్వహణ కోణంలో చూసిన బ్యాంకర్లు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎం కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ–లింక్ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు. డీ–లింక్ చేయడం ద్వారా ఏటీఎం మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్ చేసినా మిషన్‌కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్‌తో లింక్ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు. మూసేయాలని సూచించిన పోలీసులు.. బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్ పోలీసులు కీలక సవరణలు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ–లింక్ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్/క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుని.. రాత్రి వేళల్లో ఏటీఎంలకు స్కిమ్మర్లు, చిన్న కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్లు తస్కరిస్తాయి. వీటి ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేస్తుంటాయి. మిషన్‌ను డీ–లింక్ చేసినప్పటికీ వినియోగదారుడు వచ్చి అందులో కార్డు పెట్టే, పిన్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉందని పోలీసులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అలా చేస్తే స్కిమ్మింగ్ పూర్తయిపోతుందని, అలా కాకుండా ఉండాలంటే ఆయా ఏటీఎంల షట్టర్లు దింపడం ద్వారా పూర్తిగా మూసేయాలని సూచించారు. ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామని, అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
నగదు యాతన!
ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు కాస్తా బ్యాంకు ఖాతాలో జమయింది... కానీ దానిని తీసుకునేందుకు అవకాశం లేకపోతోంది. పిల్లల పెళ్లిళ్లకోసం గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూర్ అయింది... కానీ దానిని చెల్లించేందుకు బ్యాంకులో నగదు కొరతగా ఉందంట. బ్యాంకులో డబ్బు నిల్వ ఉంది కదా అని ఓ చిన్నపాటి స్థలం కొనుక్కుంటే... వారికి చెల్లించేందుకు బ్యాంకు నెంచి తెచ్చుకునే వెసులుబాటు లేదు. జీతం డబ్బు ఖాతాలో ఉంది. కానీ రోజువారీ ఖర్చులకు తీసుకుందామంటే ఏ ఏటీఎం కూడా పనిచేయడం లేదు. ఇదీ జిల్లాలో సగటు జనం క్యాష్కష్టాలు. సాక్షిప్రతినిధి విజయనగరం : పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ కష్టాలు జిల్లా వాసులను వదలనంటున్నాయి. నగదు కోసం ఏటీఎంల వద్దకెళితే ‘నో క్యాష్’బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఏకంగా షట్టర్లు వేసేసి ఉంటున్నాయి. అరకొరగా నగదు ఉన్న ఏటీఎంలవద్ద చాంతాడంత క్యూ కనిపిస్తోంది. జిల్లాలో నగదు కష్టాలు మళ్లీ పెరిగాయనే చెప్పక తప్పదు. జిల్లాలోని ఏటిఎంలలో దాదాపు సగం ఖాళీగా ఉండగా 25 శాతం ఏటిఎంలలో సగానికి కంటే తక్కువ నగదు ఉంది. మిగతా వాటిలో 75 శాతం ఉం డటంతో జనం వాటి వద్ద క్యూ కడుతున్నారు. జిల్లాకు గతంలో ఆర్బీఐ నుంచి వచ్చే నగదు కోటా కూడా సగానికిపైగా తగ్గిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిపాజిట్లు కూడా తగ్గాయి. అయితే శుక్రవారా ని కల్లా నగదు కొరత సమస్యను తీరుస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం ప్రకటించారు. మిగిలి న బ్యాంకులు మాత్రం ఇంత వరకూ ఈ సమస్యపై స్పందించలేదు. విడుదలవుతున్న నిధులు ఏ మూలకి? జిల్లా్లలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, రూరల్ బ్యాంకుల శాఖలన్నీ కలిపి 295 వరకూ ఉన్నాయి. వీటిలో 40.91 లక్షల ఖాతాదారులున్నారు. వీరిలో 40 శాతం మంది ఏటీఎం సేవలను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాలు, సామాజిక పింఛన్ల సొమ్ములు వంటి ప్రధాన రంగాలను కలుపుకొని జిల్లాకి నెలకు రూ.250 కోట్ల వరకూ అవసరం ఉంది. కానీ నోట్ల రద్దు నేపధ్యలో ఏర్పడిన స్తబ్ధత కారణంగా ఏడాదిగా ప్రతినెలా సగటున రూ.120 కోట్లకు మించిరావడం లేదు. గత నెల రూ.150 కోట్లు, తాజాగా ఈ నెల రూ.81 కోట్లు మాత్ర మే ఆర్బీఐ నుంచి వ చ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలో నగదు సమస్య తీవ్రమైంది. మరో వైపు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు నీరుగారాయి. అవసరానికి తగ్గ పరికరాలేవీ? అవగాహన ఉన్న 50 శాతం వినియోగదారులకు కూడా అందుబాటులో క్యాష్‌లెస్ ట్రాంజేక్షన్ మెషీన్లు జిల్లాలో లేవు. జిల్లా వ్యాప్తంగా కనీసం 1,500 నగదు రహిత లావాదేవీల పరికరాల డిమాండ్ ఉండగా కేవలం 831 మిషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో వైపు జిపాజిట్లు కూడా బాగా తగ్గాయి. గతేడాది డిసెంబర్‌నాటికి ముగిసిన ఆరు మాసాల్లో తొలి మూడు మాసాలకు రూ.7,956 కోట్ల మేరకు డిపాజిట్లు రాగా చివరి మూడుమాసాలలో రూ.300 కోట్ల వరకు తగ్గి కేవలం రూ.7,656 కోట్లు మాత్రమే డిపాజిట్లు లభించాయి. అన్ని విభాగాలవారీకి అవస్థలే పొలం పనులు మొదలుపెట్టడానికి పెట్టుబడికి డబ్బులు కావాలి. కానీ నగదు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి రావడంతో శుభకార్యాలు చేసుకునేవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. మే నెల మొదటి వారం తర్వాత ఆగస్టు వరకూ సుముహూర్తాలు లేవని పండితులు చెబుతుండటంతో ఈ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు వాటి నిర్వహణకు డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంక్ అధికారులను బ్రతిమలాడినా రూ.20 వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. కొంతమంది తమకు దగ్గర్లో ఉన్న ఏటీఎంలో నగదు లేకపోతే పక్క ఊళ్లల్లో, పట్టణాల్లో ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. తీరా వెళ్లాక అక్కడ చాంతాడంత లైన్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నోట్లు రద్దు చేసినప్పుడు ఎటువంటి కష్టాలు పడ్డామో ఇప్పుడూ అవే కష్టాలు పడాల్సి వస్తోందని, డబ్బులు బ్యాంక్‌లో దాచుకోవాలంటేనే భయం వేస్తోందని వారు వాపోతున్నారు. బ్యాంక్‌ల్లో నిల్వ చేయడానికి విముఖత బ్యాంక్‌ల్లో నిల్వ ఉంచడానికి ఖాతాదారులు ఇష్టపడకపోవడం వల్లే నగదు రొటేషన్ అవ్వడం లేదు. బ్యాంక్‌ల్లో నగదు దాచేందుకు ఖాతా దారులకు ఉత్సాహం చూపే దిశగా చర్యలు మెరుగుపరచాలి. వ్యాపార వర్గాలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండొచ్చు. –పి.ఎస్.సి.నాగేశ్వరావు, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ -
వీడని నగదు కష్టాలు!
ప్రజల్లో చిన్న అపోహ.. దాన్ని నివృత్తి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం.. బ్యాంకింగ్ వ్యవస్థ పరపతినే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! విత్‌డ్రాలు జోరుగా సాగుతుంటే మరోవైపు డిపాజిట్లు, జమలు నీరసించిపోతున్నాయి. దీంతో బ్యాంకుల్లో నగదు కొరత తీరట్లేదు సరికదా... ప్రతినెలా లావాదేవీల కోసం రిజర్వ్‌బ్యాంకు వైపు చూడాల్సిన ఆగత్యం తప్పట్లేదు! దీంతో ప్రజలు ముఖ్యంగా రైతుల నగదు కష్టాలు తారస్థాయికి చేరాయి. ధాన్యం సొమ్ము ఖాతాలో కనిపిస్తున్నా నగదు చేతికి రాక అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. ఇవిలా ఉండగానే మళ్లీ ఖరీఫ్ కాలానికి మదుపులు ఎలాగనే భయాందోళనకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో రైతులు 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీల) ద్వారా విక్రయించారు. ఈ కొనుగోళ్లు మార్చి 31వ తేదీతో ముగిసిపోయాయి. అయితే ఆ ధాన్యంకు సంబంధించిన సొమ్ము చాలావరకూ రైతుల ఖాతాల్లో జమ అయ్యిందని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ సొమ్ము బ్యాంకుల నుంచి రైతుల చేతుల్లోకి చేరట్లేదు. జిల్లాలో జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులు 24 తాలూకు బ్రాంచిలు 260 ఉన్నాయి. వీటికి జిల్లావ్యాప్తంగా 300 వరకూ ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో నిర్వహణ సరిగాలేక 32 ఏటీఎంలు పనిచేయట్లేదు. 268 ఏటీఎంలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.10 కోట్లు వరకూ నగదు ఉంచాల్సి ఉంది. కానీ వాటిలో 60 వరకూ క్యాష్ రీసైకిల్ ఏటీఎంలే. వాటిలో ఎవ్వరైనా డిపాజిట్ చేస్తే మరెవ్వరికైనా ఆ నగదును విత్‌డ్రా చేసే అవకాశం లభిస్తోంది. చాలా ఏటీఎంలు నగదు లేకుండా దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అవసరాల కోసం రోజుకు రూ.200 కోట్లు నగదు కావాలి. కానీ ప్రస్తుతం బ్యాంకుల్లో రోజువారీ లావాదేవీలు రూ.8 కోట్లకు పడిపోయాయి. మరోవైపు నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని తెరపైకి తెచ్చినా ఆచరణలో పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం రైతులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు వ్యయప్రయాసలు ఎదుర్కొని వస్తున్నారు. తీరా బ్యాంకులలో రూ.2 వేలు లేదంటే రూ.3 వేల వరకూ మాత్రమే విత్‌డ్రా చేయడానికి సిబ్బంది అంగీకరిస్తున్నారు. ఎక్కువ మొత్తం కావాలంటే నగదు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నగదు కోసం నగుబాటు తప్పదా... కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు చలామణి తగ్గిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వస్తున్న నోట్లకు, అవి ప్రజల్లో వెళ్లి మళ్లీ బ్యాంకుకు తిరిగొస్తున్న నోట్ల సంఖ్యకు చాలాచాలా వ్యత్యాసం కనిపిస్తోందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. దీనికితోడు జిల్లా ప్రజలు ఎక్కువమంది కొనుగోళ్లు విశాఖపట్నం, విజయనగరంలోనే చేస్తున్నారు. దీనికి నగదుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో జిల్లా నుంచి నగదు చాలావరకూ పొరుగు జిల్లాలకు వెళ్లిపోతోందని బ్యాంకు సిబ్బంది వాదన. నగదురహిత లావాదేవీలకు అవకాశం ఉన్నా వ్యాపారుల్లో చాలామంది జీఎస్టీ భయంతో క్యాష్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కార్డుల కన్నా క్యాష్తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుండటం దీనికి నిదర్శనం. దీనివల్ల నగదు వ్యాపారుల చేతుల్లోకి, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లోని పెద్ద వ్యాపారులు (డిస్ట్రిబ్యూటర్లు), డీలర్ల చేతిలోకి నగదు వెళ్లిపోతోందనేది మరో వాదన. ఏదేమైనా జిల్లాలో మాత్రం నగదు కొరత తీరట్లేదు. గత ఏడాది చివర్లో వచ్చిన ఎఫ్ఆర్డీఐ బిల్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు, జమలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనిపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు విఫలమయ్యాయి.దీంతో బ్యాంకుల్లో నగదు నిల్వ ప్రతి నెలా తగ్గిపోతోంది. ఆర్బీఐ నుంచి నెలనెలా వచ్చే నగదు కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. గత నెల రూ.100 కోట్లు కావాలని కోరితే రూ.90 కోట్ల నగదు వచ్చింది. దీనిలో రూ.35 కోట్ల వరకూ పింఛన్లకే పోయింది. మళ్లీ ఈనెలలో మరో రూ.100 కోట్ల నగదు కోసం బ్యాంకర్లు విన్నపాలు చేశారు. దీనిలో మళ్లీ పింఛన్లకు రూ.35 కోట్లు పోతే మిగిలిన సొమ్ము ఖాతాదారుల అవసరాలకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ప్రతినెలా ఇదే పరిస్థితి ఉండటంతో జిల్లాలో ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే భయమేల? ఎఫ్ఆర్డీఐ బిల్లుపై సందేహాలు తగదు. దానివల్ల ఖాతాదారుల డిపాజిట్లకు వచ్చే నష్టమేమీ ఉండదు. సొమ్ము ఇళ్లల్లో కన్నా బ్యాంకుల్లో ఉంటేనే భద్రం కూడా. ప్రస్తుతం బ్యాంకుల నుంచి విత్‌డ్రా అవుతున్న సొమ్ము కన్నా తిరిగి బ్యాంకులకు వచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉంటోంది. దీనివల్ల లావాదేవీలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈనెల 25వ తేదీ నాటికి రూ.100 కోట్లు నగదు అవసరమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా ఆర్బీఐకి నివేదించాం. గత నెల ఇలా రూ.100 కోట్లు కోరితే ఈనెల మొదటి వారంలో రూ.90 కోట్లు జిల్లాకు వచ్చింది. పింఛన్ల కోసమే రూ.35 కోట్లు నగదు నెలనెలా అవసరమవుతోంది. – పి.వెంకటేశ్వరరావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు, శ్రీకాకుళం అప్పులు తీరక ఉక్కిరిబిక్కిరి... నేను ఫిబ్రవరిలో 87 క్వింటాళ్ల ధాన్యం పాలకొండ పీఏసీఎస్‌కు అందించాను. కానీ ఆన్లైన్లో నా భూమి వివరాలు లేవని నెల రోజులు తిప్పారు. తర్వాత బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. కానీ ఇప్పటికీ మొత్తం డబ్బు చేతికి రావట్లేదు. రోజంతా బ్యాంకు వద్ద లైన్లో నిలబడితే రెండు వేలో, మూడో వేలో ఇస్తామంటున్నారు. ఏటీఎంలు పనిచేయట్లేదు. ఏడాది క్రితం పొలం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరట్లేదు. అప్పు ఇచ్చినోళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చే ఖరీఫ్‌కు మదుపు చూసుకోవాలి. – బలగ నాగేశ్వరరావు, కొండాపురం, పాలకొండ మండలం చేతకాని ప్రభుత్వం వల్లే అవస్థ నేటికి నా ధాన్యం సొమ్ము బ్యాంకు నుంచి తీసుకోలేకపోతున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (పీపీసీ)లోనే ధాన్యం ఇచ్చా. పాస్ పుస్తకాలు, అడంగల్ పత్రాలంటూ తొలుత పీపీసీ వాళ్లు తిప్పారు. ధాన్యం సొమ్ము తీరా ఖాతాలో జమ చేసినా బ్యాంకుల్లో నగదు లేక చేతికి ఇవ్వట్లేదు. రైతులను ఏవిధంగా ఆదుకోవాలో చేతకాని ప్రభుత్వమిది. – కండాపు ప్రసాదరావు, రుద్రిపేట, పాలకొండ మండలం ఖాతాలకే పరిమితమైన ధాన్యం డబ్బు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మితేనే మా అప్పులు తీరుతాయి. కానీ పీపీసీల్లో అమ్మడానికీ ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఉన్నా అక్కడా ఇప్పటికీ అవసరమైనంత తీసుకోలేకపోతున్నాను. ఇంటి అవసరాలకూ ప్రైవేట్ వ్యాపారులు, తెలిసినవాళ్ల వద్ద చేబదులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో! – యాబాజి రమేష్, లింగాలపాడు, నరసన్నపేట ప్రజల్లో చైతన్యం వస్తేనే పరిష్కారం ప్రజల్లో చైతన్యం రానంతవరకూ బ్యాంకుల్లో నగదు కష్టాలకు పరిష్కారం దొరకదు. ప్రస్తుతం బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. కొబ్బరి వ్యాపారులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తాలను ఇవ్వడానికి కూడా బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రైతుల నుంచి కొన్న సరకుకు సకాలంలో నగదు చెల్లించలేకపోతున్నాం. – నరేష్ గుప్తా, చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు, కంచిలి -
నో క్యాష్
సాక్షి, మచిలీపట్నం/ సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నగదు కష్టాలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల్లో అవసరమైన మేరకు నగదు డ్రా చేయడం సాధ్యపడట్లేదు. పర్సులో డబ్బు ఖాళీ అయితే ఏటీఎం నుంచి డ్రా చేయాలనుకునే వారి కష్టాలు వర్ణనాతీతం. ఎందుకీ సమస్య ♦ కృష్ణాజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ప్రధాన శాఖలు 846 ఉండగా, ఆయా బ్యాంకులకు సంబంధించి 1,051 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 80శాతం ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడింది. ♦ గుంటూరు జిల్లాలో మొత్తం బ్యాంకులు (బ్రాంచీలతో కలిపి) 824 ఉండగా, 870కి పైగా ఏటీఏంలు ఉన్నాయి. ఇందులో 70 శాతం పైగా ఏటీఎంలు పనిచేయట్లేదు. ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో సైతం డబ్బు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 30 శాతానికి పైగా ఏటీఎంలు శాశ్వతంగా మూతపడ్డాయి. 2016, నవంబర్‌లో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంతకాలం నగదు కష్టాలు వెంటాడాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. కారణాలివీ.. నగదు కష్టాలకు రెండు కారణాలు ప్రముఖంగా నిలుçస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి జిల్లాకు నగదు నిల్వలు స్తంభించడం, పార్లమెంట్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉండటాన్ని కారణంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో నగదుపై ఖాతాదారులకు అధికారం ఉండదనే ప్రచారం ప్రస్తుతం బాగా జరుగుతోంది. రోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు ♦ కృష్ణాజిల్లాలో అన్ని బ్యాంకుల్లో కలిపి నిత్యం దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేర నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, సామాజిక పింఛన్‌దారులకు చెల్లింపులు.. తదితరాలకు ప్రతినెలా మొదటి వారంలో అయితే పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు అత్యధిక శాతం ఎస్బీఏలోనే జరుగుతాయి. ఈ బ్యాంకులకు తొలివారం రూ.300 కోట్లకుపైగా అవసరమని తెలిసింది. ♦ గుంటూరు జిల్లాలోని బ్యాంకుల్లో 2017, అక్టోబర్ నాటికి రూ.25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది బ్యాంకుల్లో 15–17 శాతం డిపాజిట్లు పెరిగేవి. అయితే, అందులో ఖాతాదారులు ఇప్పటికే 10 శాతం మేర డిపాజిట్లు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో రూ.3,382.28 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఎన్పీఏ (నిర్థారక ఆస్తులు) 1 నుంచి 2 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి విలువ 13–14 శాతం పెరగటంతో బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. కేవలం విత్‌డ్రాలే.. కరెన్సీ కష్టాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో నగదు జమ తక్కువగా, చెల్లింపులు (విత్‌డ్రా)లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో విత్‌డ్రాలకు అవసరమైన మేర నగదు సమకూర్చడం తలనొప్పిగా పరిణమించింది. ప్రధానంగా రూ.2వేలు, రూ.500 నోట్ల కొరత అధికమైంది. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు వచ్చే రూ.500, రూ.2వేల నోట్లను చాలామంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇళ్లల్లోనే దాచుకుంటున్నారు. తిరిగి వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు సాహసించట్లేదు. వ్యాపారులే ఆదరువు ఇతర బ్యాంకులు, శాఖలు.. ప్రైవేట్ బ్యాంకులతో మాట్లాడుకుని ఏరోజుకారోజు నగదు సర్దుబాటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలు, ఆర్టీసీ డిపోలు, కొందరు వ్యాపారుల నుంచి నిత్యం వచ్చే నగదు జమలు ప్రస్తుతం బ్యాంకర్లకు ఆదరువుగా నిలుస్తున్నాయి. పార్లమెంట్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశ పెడుతున్నారనే ప్రచారం, దీనివల్ల బ్యాంకుల్లో నగదుపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ బిల్లు అమలు ప్రక్రియ పరిశీలించేందుకు ఇంకా కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారని బ్యాంకర్లు చెబుతున్నా.. అది ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని రూపుమాపడం లేదు. -
ఏమార్చి... ఏటీఎం కార్డులు మార్చి
ఆనందపురం(భీమిలి): అతను ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేస్తాడు... కేంద్రాలకు వచ్చి నగదు తీసుకునేందుకు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారితో మాటలు కలుపుతాడు... సాయం చేస్తానని నమ్మించి వారి వద్ద నుంచి కార్డు తీసుకుని కొంతసేపు ప్రయత్నిస్తాడు... కార్డు పనిచేయడం లేదని చెప్పి అప్పటికే తన వద్ద ఉన్న నకిలీ కార్డుని సదరు వ్యక్తికి ఇచ్చేసి అసలు కార్డుతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు. అనంతరం ఆ కార్డు సాయంతో ఖాతాలోని డబ్బులన్నీ తస్కరిస్తాడు. ఇదీ సులువుగా డబ్బు సంపాదించేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేంద్రసింగ్ ఎంచుకున్న మార్గం. కొంత కాలం సాఫీగా దొంగతనాలు సాగినా, అతనిపై పోలీసులు గట్టి నిఘా ఉంచి అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. మండలంలోని వెల్లంకితో పాటు పలు చోట్ల చోరీకి పాల్పడిన దొంగను స్థానిక పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఆర్.గోవిందరావు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌ఘర్ జిల్లా పూరి పాండేక పూర్వ గ్రామానికి చెందిన యోగేంద్ర సింగ్ (31) తన భార్యతో కలిసి కొంత కాలం క్రితం బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని ఓ పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనిలో చేరాడు. భార్యను కూడా అక్కడే పనిలోకి కుదుర్చాడు. ఇదిలా ఉండగా పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచన చేసి ఏటీఎం కేంద్రాలను ఎంచుకున్నాడు. కొన్నాళ్లు క్రితం విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గల ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి అవస్థలు పడడం చూసి తాను సాయం చేస్తానంటూ వెళ్లి ఏటీఎం కార్డుతో సొమ్ము డ్రా చేసినట్టు నటించి కార్డు పనిచేయలేదని చెప్పి అసలు ఏటీఎం కార్డుని తన వద్దు ఉంచుకొని నకిలీ కార్డుని ఆ వ్యక్తి చేతిలో పెట్టి చల్లగా జారుకున్నాడు. అనంతరం ఆ ఏటీఎం కార్డుతో రూ.40 వేలు డ్రా చేశాడు. దీంతో అప్పట్లో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పట్టించిన సీసీ కెమెరా ఫుటేజీ గత ఏడాది నవంబర్ 17న మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గొలగాని అప్పలరాజు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ యోగేంద్ర సింగ్ మాటు వేసి ఉన్నాడు. డబ్బులు డ్రా చేయడానికి అప్పలరాజు ఇబ్బందులు పడడాన్ని గమనించిన యోగేంద్ర సింగ్ తాను సాయం చేస్తానని చెప్పి ఎప్పటిలాగే కార్డులో సమస్య ఉందని, డబ్బులు రావడం లేదని చెప్పి నకిలీ ఏటీఎం కార్డు అప్పలరాజుకి ఇచ్చి అసలు కార్డుతో జారుకున్నాడు. ఆ కార్డుతో యోగేంద్ర సింగ్ నాలుగు రోజులలో ఆన్లైన్లో వివిధ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు కొంత సొమ్ము డ్రా చేశాడు. ఇదిలా ఉండగా ఆన్లైన్లో తాను వస్తువులు కొనుగోలు చేసిన్టటు అప్పలరాజు సెల్‌కు సమాచారం రావడంతో బ్యాంక్‌కు వెళ్లి విచారించగా రూ.1.52 లక్షలు తన ఖాతా నుంచి మళ్లిపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ ఆర్.గోవిందరావు ముందుగా ఏటీఎం కేంద్రంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతనిపై పాత నేరాలు కూడా ఉన్నట్టు రూఢీ చేసుకున్నారు. ఎస్ఐ గణేష్ ఇతర పోలీసు సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యోగేంద్ర సింగ్‌ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, ఒక సెల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకొని కోర్టుకి తరలించారు. గతంలో గాజువాకతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వివరాలు రావాల్సి ఉందని సీఐ తెలిపారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగల అరెస్టు
ఒంగోలు క్రైం: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను మోసం చేసి నగదు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు నలుగురిని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోనూ అనేక ఏటీఎంల వద్ద ప్రజలను మోసం చేసిన కరుడుగట్టిన మోసగాళ్లను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తన కార్యాలయంలో ఎస్పీ బి.సత్య ఏసుబాబు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. అద్దంకి ఎస్ఐ సుబ్బరాజుకు వచ్చిన సమాచారం మేరకు శింగరకొండ కమ్మ సత్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నలుగురూ కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలుగా గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రంగసముద్రం భాస్కరరెడ్డితో పాటు అతనికి సహకరించిన అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ గ్రామానికి చెందిన సున్నశెట్టి కృష్ణమూర్తి, ఓబులదేవ చెరువు (ఓడిసి) మండలం నల్లగుంట్లపల్లి గ్రామానికి చెందిన నండూరి వెంకటేష్, గాండ్లపెంట మండలం గాజులవారిపల్లె గ్రామానికి చెందిన ఆకుల హరినాధ్లను అరెస్టు చేశారు. 70కి పైగా నేరాలు మూడు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 70కి పైగా నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రంగసముద్రం భాస్కరరెడ్డి ఏటీఎం దొంగల ముఠాకు నాయకుడు. ఇతను గతంలో హోంగార్డుగా పనిచేశాడు. నేరాలకు పాల్పడుతుండటంతో ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కృష్ణమూర్తితో కలిసి కొంతకాలం నేరాలు చేశాడు. 2016 జూన్ నుంచి నండూరి వెంకటేష్, ఆకుల హరినాథ్‌లను ముఠాలో చేర్చుకున్నాడు. మొత్తం 70కి పైగా నేరాలకు పాల్పడగా అందులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నేరాలు చేశారు. 2017 మే నెలలో 29 కేసుల్లో కదిరి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి నేరాలు చేస్తూనే ఉన్నారు. వీరిపై అనేక పోలీస్స్టేషన్లలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జూదాలు, మగువలు, మద్యానికి బానిసలై విలాసాలకు అలవాటు పడి ఏటీఎంల వద్దకు వచ్చే అమాయకులను మోసం చేయటమే పనిగా పెట్టుకున్నారు. నేరం చేసే విధానం ఇలా.. వీరు ఎస్బీఐ ఏటిఎం సెంటర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని అమాయకులను మోసం చేస్తారు. ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధులు, చదువురాని వారు, అమాయకులు వచ్చినప్పుడు వాళ్లకు సాయం చేసినట్లుగా నటిస్తారు. మిషన్‌లో కార్డు వాడటం చేతగాని వారిని గుర్తించి వాళ్ల కార్డును తీసుకొని మిషన్‌లో పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయమంటారు. ఈ లోగా వీళ్లలో ఒకరు ఆ పిన్ నంబర్ గమనించి గుర్తు పెట్టుకుంటారు. మరొకరు వీరి వద్ద ఉన్న అదే బ్యాంక్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి అసలు కార్డును వీళ్ల వద్ద ఉంచుకుంటారు. వాళ్లు వెళ్లిన తర్వాత అసలు కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు డ్రా చేస్తారు. ఒకరోజు విత్‌డ్రా బ్యాలెన్స్ పరిమితి దాటితే ఈ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ల వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డు ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇలా అపహరించిన ఏటీఎం కార్డుల ద్వారా స్వైపింగ్ చేసి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. 27 ఏటీఎం సెంటర్లలో మోసం ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 27 ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. జిల్లాలో ఈ ఏడాది అద్దంకిలో ఎస్బీఐ ఏటీఎం వద్ద ఒకరిని మోసం చేసి రూ.49 వేలు కాజేశారు. పొదిలిలో రూ.75 వేలు, పామూరులో రూ.50 వేలు, కనిగిరిలో రూ.40 వేలు కాజేశారు. మూడు రాష్ట్రాల్లో కలిపి రూ.14.75 లక్షలు ఏటీఎంల వద్ద కాజేశారు. వీరి నుంచి రూ.7.88 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు రివార్డులు అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగలను చాకచక్యంగా పట్టుకున్న అద్దంకి సీఐ హైమారావు, ఎస్ఐ సుబ్బరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగరాజు, ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఎం.కోటేశ్వరరావు, కానిస్టేబుల్ యు.కోటేశ్వరరావులను ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏబీటీఎస్ ఉదయరాణి, ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
విత్‌డ్రా కష్టాలు ఉంటాయా.. పోతాయా?
ఈ నెలాఖరు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి కరెన్సీ విత్‌డ్రా చేయడానికి పరిమితులు చాలావరకు ఉండబోవని, ఎంచక్కా వెళ్లి కావల్సినంత మొత్తం తీసుకోవచ్చని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా ఇప్పట్లో జరిగేలా లేదు. డిసెంబర్ 30 తర్వాత కూడా నోట్ల విత్‌డ్రా మీద పరిమితులు కొనసాగుతాయని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి. బ్యాంకులలో పని సక్రమంగా నడవాలంటే, ఈ పరిమితి కొన్నాళ్లు కొనసాగించక తప్పదని బ్యాంకర్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కరెన్సీ ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. దాంతో వారానికి 24వేల రూపాయల చొప్పున కూడా చాలావరకు బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. వచ్చిన కస్టమర్లకు 5-10 వేలు ఇచ్చి సర్దుకుపొమ్మని చెబుతున్నాయి. నాసిక్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో 500 రూపాయల నోట్ల ముద్రణను మూడురెట్లు పెంచామని చెబుతున్నా, ఆ డబ్బులు ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ, ఏటీఎంలలోకి వచ్చి.. తగినంత క్యాష్ అందుబాటులోకి రావాలంటే ఇంకా సమయం పడుతుందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువు ఏమాత్రం సరిపోవడం లేదని, మరి కొంత కాలం పాటు ఈ కష్టాలు తప్పవని తెగేసి చెబుతున్నారు. ఏటీఎంల నుంచి కూడా ఎంత కావాలంటే అంత విత్‌డ్రా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకు మరింత మొత్తంలో నగదు అందుబాటులోకి వస్తే తప్ప పరిమితి ఎత్తేయడం సాధ్యం కాదని ఈమధ్యే ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా చెప్పారు. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు మొత్తం 5.92 లక్షల కోట్ల కొత్త నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. అయితే, రద్దు చేసిన నోట్ల విలువ మాత్రం 15.4 లక్షల కోట్లు కావడంతో.. ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. ఈనెల పదో తేదీ వరకు రద్దు చేసిన పెద్దనోట్లు రూ. 12.4 లక్షల కోట్ల మేర బ్యాంకులకు వచ్చినట్లు రిజర్వు బ్యాంకు చెబుతోంది. -
బ్యాంక్ ఖాతాదారులకు వైఎస్సార్సీపీ నేత సాయం
హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల వద్ద భారీగా క్యూ లైన్లు ఉండడంతో వృద్ధులు, మహిళల సమస్యలు వర్ణణాతీతంగా మారాయి. దీంతో కొంత మంది దయామయులు క్యూలో నిల్చున్న వారికి తమ వంతు సాయంగా తాగునీరు, టీలు అందజేస్తున్నారు. శుక్రవారం చైతన్యపురిలోని ఏటీఎంల వద్ద క్యూలైన్లలో ఉన్నవారికి వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ సాయం అందించారు. నోట్ల రద్దుతో పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి ఫ్రూటీలను అందించారు. ఆయన సాయం చేయడంపై ఖాతాదారులు ధన్యవాదాలు తెలిపారు. -
కరెన్సీ కష్టాలు కంటిన్యూ@15వ రోజు
-
కరెన్సీ కష్టాలు కంటిన్యూ
పెద్ద నోట్లు రద్దయి 15 రోజులు గడుస్తోంది. ఇంకా ప్రజల కష్టాలు తీరలేదు. ఆర్బీఐ కొత్త నిబంధనలతో ఖాతాదారుల తల బొప్పి కడుతోంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సొమ్ము డ్రా చేసుకోవడానికీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు మూతపడ్డాయి. జిల్లాలోని ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం లేదు. అవసరాలకు తగ్గట్టు బ్యాంకులకు నగదు రాక.. చేతిలో చిల్లిగవ్వలేక ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. తిరుపతి (అలిపిరి) :పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను వీడడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద నోట్లు రద్దయి 15 రోజులు గడిచిపోయింది. ఇంకా జిల్లా ప్రజలకు కరెన్సీ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నా యి. ఉదయం నిద్రలేచిన మొదలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. సామాన్యులు పెద్ద నోట్లు చేతబట్టి నగదు మార్పిడికి అవస్థలు పడుతున్నారు. అరకొర నిధులు ఆర్బీఐ నుంచి అరకొర నిధులు జిల్లాకు వస్తుండడంతో నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులందరికీ పూర్తి స్థాయి సేవలందించలేక బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. ఒక వైపు ఆర్బీఐ మాత్రం ప్రజలకు సరిపడా నగదు బ్యాంకులకు అందిస్తున్నామంటూ చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 593 బ్యాంకు శాఖలు ఉంటే అందులో 50 శాతం కూడా ప్రజలకు సేవలందించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు వంటి ప్రముఖ ప్రాంతాల్లోనూ బ్యాంకు సేవలు పేలవంగా ఉన్నాయి. తెరుచుకోని ఏటీఎంలు జిల్లాలో 708 ఏటీఎం కేంద్రాలు ఉండగా అందులో 20 శాతం కూడా తెరుచుకోవడం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన అరకొర ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అయితే అక్కడ నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ అవుతోంది. ఏటీఎం కేంద్రాలకు వస్తున్న ఖాతాదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే బ్యాంకులకు వచ్చే ప్రజల రద్దీ తగ్గే అవకాశం ఉంది. పెంపు సరే.. నగదెక్కడ? ఖాతాదారులు విత్‌డ్రా పరిమితిని రూ.24 వేల నుంచి రూ.50వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. జిల్లాలో పలు ప్రధాన శాఖల్లో నగదు కొరత కారణంగా ఖాతాదారుల విత్‌డ్రాలకు సంబంధించి రూ.4వేల నుంచి రూ.5 వేలు వరకే ఇవ్వగలుగుతున్నారు. తాజాగా ఆర్బీఐ విత్‌డ్రా పెంపు స్వాగతించే విషయమే అయినా ఖాతాదారులకు పూర్తి స్థాయి సేవలు అందించాలంటే జిల్లాకు పంపుతున్న నగదు పరిమితిని పెంచాల్సి ఉంటుంది. అలాకాకుండా విత్‌డ్రా పరిమితి పెంపు అంటే ఎటుంటి ఉయోగమూ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇలా తెరిచారు... అలా అయిపోయాయి!
-
ఇలా తెరిచారు... అలా అయిపోయాయి!
పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిరోజు ఏటీఎంలు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అలా వెంటనే మూతపడ్డాయి. చాలావరకు ఏటీఎంలలో ఉదయమే నాట్ వర్కింగ్ అని, నో సర్వీస్ అని బోర్డులు వెలిశాయి. ఒకటీ అరా అక్కడక్కడ తెరుచుకున్నాయి గానీ, వాటిలో గట్టిగా పది పదిహేను మంది డబ్బులు తీసుకున్నారో లేదో.. వాటిలో డబ్బులు అయిపోయాయి. ఏటీఎం మిషన్లలో చాలావరకు వంద, యాభై రూపాయల నోట్లనే పెట్టడంతో, ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు తీసుకోవడంతో అవి త్వరగానే అయిపోయాయి. మళ్లీ వాటిలో డబ్బులు నింపాలంటే ఏజెన్సీల వాళ్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇంకా చాలావరకు ఏటీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా అసలు ముందునుంచే పనిచేయలేదు. రెండువేల రూపాయల నోట్లు పెట్టడం, వాటిని డిస్పెన్స్ చేయడానికి సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో కొన్ని ఏటీఎంలు పనిచేయలేదని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఏటీఎంలు ఉంటే, వాటిలో దాదాపు 50 వేల మిషన్లలో పాతనోట్లే ఉన్నాయన్నది మరో కథనం. దాంతో.. అవి కూడా పనిచేయలేదు. మొత్తమ్మీద బ్యాంకుల్లో క్యూలైన్లు పెద్దగా ఉన్నందున ఏటీఎంలో తక్కువైనా తీసుకుందామని వెళ్లినవారికి మాత్రం చుక్కలు కనిపించాయి. అసలు ఏటీఎం పనిచేస్తోందో లేదో తెలియకపోయినా చాలాచోట్ల పెద్దపెద్ద క్యూలైన్లు కనిపించాయి. ఏటీఎంలలో నోట్లు నింపే వేగాన్ని పెంచడం, ఇంతకుముందు కంటే ఎక్కువసార్లు డబ్బులు నింపడం లాంటి చర్యల ద్వారా కొంతవరకు ఈ కష్టాలను అధిగమించే అవకాశం ఉంది. వేరే బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు తీసుకునే అవకాశం ఉండటంతో ఉదయం పనిచేసిన కొన్ని ఏటీఎంల వద్దకు వచ్చినవాళ్లు తమకున్న మూడు నాలుగు డెబిట్ కార్డులను ఉపయోగించి ఒక్కో దాంట్లో 2 వేల రూపాయల చొప్పున డ్రా చేసుకున్న సందర్భాలు సైతం కనిపించాయి. దానివల్లే డబ్బులు త్వరగా ఖాళీ అయిపోయాయి తప్ప డబ్బులు తక్కువ పెట్టడం కారణం కాదని కొంతమంది బ్యాంకు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పెద్దనోట్ల రద్దు కష్టాలు మరికొన్నాళ్లు తప్పేలా లేవు. -
ఏటీఎంలతో ఎన్ని తిప్పలో!
-
ఏటీఎంలతో ఎన్ని తిప్పలో!
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా సరిగా తెరుచుకోలేదు. రూ. 2వేల నోట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మిషన్లు పనిచేయడం లేదు. దాంతో అక్కడున్న సిబ్బంది, గార్డులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. బ్యాంకులలో భారీ క్యూలు ఉంటున్నాయని, దానికి బదులు రెండు వేల రూపాయలే వచ్చినా ఏటీఎంలో తీసుకోవడం మెరుగని అక్కడకు వెళ్తే.. ఏటీఎంలు పనిచేయడం లేదని పలువురు వాపోయారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూలు మొదలైపోయాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్న బ్యాంకు యాజమన్యాలు.. దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. మరికొన్ని బ్యాంకుల వాళ్లు ఎందుకైనా మంచిదని అసలు ఏటీఎం సెంటర్లను ఓపెన్ చేయలేదు. చాలావరకు ఏటీఎంల వద్ద ఔటాఫ్ సర్వీస్ అనే బోర్డులు బయటే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఏటీఎంల నుంచి వంద రూపాయల నోట్లు వస్తున్నట్లు వినియోగదారులు చెప్పారు. ఎక్కువ శాతం ఏటీఎంలు మాత్రం అయితే తెరుచుకోకపోవడం, ఒకవేళ ఉన్నా చివరి వరకు వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం చూపించి డబ్బులు రాకపోవడం లాంటివి జరుగుతున్నాయి. -
త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య కోవూరు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం కేంద్రాలను కోవూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ శాఖ రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య తెలిపారు. స్థానిక ఏపీజీబీ బ్యాంక్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే ఏడు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో మూడు ఏటీఎం కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వాటిలో కోవూరు, పెంచలకోన, కొండాపురం బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు మార్టిగేజ్ లేకుండా సరిపడా భూమి ఉంటే తమ శాఖ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే రాబోయే కాలంలో 25వేల మంది రైతులకు పంట రుణాలు మా శాఖ ఆధ్వర్యంలో ఇవ్వనున్నామన్నారు. కోవూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్.వరప్రసాద్ మాట్లాడుతూ తమ బ్రాంచి ఆధ్వర్యంలో ఎన్పీఏ కింద స్వయం సహాయ సంఘాల సభ్యులు దగ్గర నుంచి సుమారు రూ.కోటి వసూలు కావాల్సి ఉందన్నారు. ఆయన వెంట ఫీల్డ్ ఆఫీసర్ పి.అంజన్‌కుమార్, బ్రాంచి సిబ్బంది ఉన్నారు. -
కాపలాలేని ఏటీఎంలే టార్గెట్
పేట్రేగుతున్న దొంగలు తొమ్మిది నెలల్లోనే 8 ఘటనలు అయినా భద్రతపై చర్యలు శూన్యం చోద్యం చూస్తున్న అధికారులు మెదక్: దొంగలు పేట్రేగిపోతున్నారు. కాపలాలేని ఏటీఎంలనే టార్గెట్‌చేస్తు దోపిడీలు చేస్తున్నారు. ఇందులో కొన్నింట్లలో దోచుకెళుతుండగా మరికొన్ని తెరుచుకోకపోవటంతో వదిలేసి వెళ్లిపోతున్నారు. గడిచిన 9 మాసాల్లో జిల్లాలో 8కి పైగా ఈలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా బ్యాంకు అధికారులు ఏటీఎంల వద్ద భద్రతపై దృష్టి సారించడంలేదు. గతయేడాది డిసెంబర్ మాసంలో మెదక్ పట్టణం వెంకటరావు నగర్ కాలనిలోని రోడ్డుపక్కన గల ఏటీఎంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొంగలు బులేరాపై వచ్చి గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేస్తుండగా బస్తీతిరిగే పోలీసులు వారిని అటకాయింయటంతో బులేరోవాహనంలో పరారయ్యారు. పోలీసులు వెంబడించినా ఫలితంలేకుండా పోయింది. అదేరోజు రాత్రి çసంగారెడ్డిలోని ఏటీఎంను పగులగొట్టిన దొంగలు కొద్దిమొత్తం డబ్బును ఎత్తుకెల్లినట్లు తెలిసింది. గతంలో పెద్ద శంకరంపేట ఏటీఎం, రంగంపేటలో బ్యాంకుదోపిడీకి యత్నించారు. టేక్మాల్, అల్లాదుర్గంలో ఏటీఎం, అలాగే ఇటీవల మూడు మాసాల్లోనే పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గల ఏటీఎంను రెండు సార్లు దొంగలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఇటీవల అదేమండలంలోని యూసుపేటలోని బ్యాంకును సైతం దోచుకునేందుకు తీవ్ర ప్రయంత్నం చేశారు. మూడు రోజుల కిందట హత్నూరమండలం దౌల్తాబాద్‌లోని చౌరస్తాలో ఏటీఎంలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దొంగలు పోలీసుల రాకను గమనించి పరారయ్యారు. ఏటీఎంలను టార్గెట్చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత బ్యాంకుల అధికారులు మాత్రం స్పందించటంలేదు. ఈ విషయంపై పోలీసులు బ్యాంకుల అధికారులను పిలిచి సమావేశపరిచి అవగాహన కల్పించినప్పటికీ వారు భద్రతపై ఏమాత్రం చొరవచూపటంలేదన్న ఆరోపణలున్నాయి. మెదక్ పట్టణంలో సుమారు 15 ఏటీఎంల వరకు ఉండగా అందులో ఒకటిరెండింట్లో తప్పా మిగతా ఏటీఎంలలో ఏలాంటి భద్రతను ఏర్పాటు చేయటం లేదు. ఈ విషయపై ఓ బ్యాంకు ఉన్నతాధి కారిని ప్రశ్నించగా తాము ఏటీఎంల భద్రతను కాంట్రాక్టు పద్ధతిన వేరేవారికి అప్పగించామని తెలిపారు. ఏటీఎంలో దాచి ఉంచిన డబ్బుకు బీమా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. ఉన్న కొద్దిమంది పోలీసులు ఏటీఎంలు, పట్టణాల్లో గస్తీ తిరగటం కష్టంగా మారినట్లు ఓ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి ప్రతి ఏటీఎం వద్ద కాపలా దారులను ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
-
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది. కొట్టుపురం, ముడిచూర్, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్ - తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ ల్యాండ్లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది. -
ఏటీఎంల వద్ద భారీ క్యూలు
-
నడుస్తున్న రైళ్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి క్రమంగా వస్తోంది. బయ్యారం - ఎలమంచిలి మధ్య రైల్వే బ్రిడ్జిని పునరుద్ధరించారు. రెండు ట్రాకులు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాలకు బుధవారం సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిషాకు కూడా రవాణా మార్గాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి, రైలు మార్గాలను పునరుద్ధరించారు. మరోవైపు.. కొన్ని ఏటీఎం కేంద్రాలు కూడా ఇప్పుడిప్పుడే పనిచేయడం ప్రారంభించాయి. దాంతో డబ్బులు తీసుకోడానికి వాటి ముందు భారీ క్యూలలో ప్రజలు వేచిచూస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఈ క్యూలలో వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల తర్వాత వీటిలో రెండు మూడు కేంద్రాలు పనిచేస్తుండటంతో చాలామంది డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లారు. తుఫాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్దా ఇళ్లలో పెద్దగా డబ్బులు లేకపోవడం, ఏటీఎంలలో ఇన్వర్టర్లు విద్యుత్ సరఫరా లేక ఛార్జింగ్ అయిపోయి అవి పనిచేయడం మానేశాయి. అసలే ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, మరోవైపు డబ్బు లేకపోవడంతో విశాఖ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తోంది. -
పోలీసుల అదుపులో ఏటీఎం మాయగాడు
కావలి, న్యూస్‌లైన్: ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులే వారి టార్గెట్. సాయం చేస్తున్నట్టు నటించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. వాళ్లేమన్నా ప్రొఫెషన్ నేరస్తులనుకుంటే పొరపాటే. జల్సాల కోసం మోసాలబాట పట్టిన వారిద్దరూ ఇంటర్ విద్యార్థులు కావడం గమనార్హం. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వీరి గుట్టును రట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరొకరి కోసం గాలిస్తున్నారు. కావలి ఒకటో పట్టణ ఎస్సై అంజిబాబు కథనం మేరకు.. కావలికి చెందిన సాయిగుప్తా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మరో విద్యార్థి స్నేహితుడు. వీరిద్దరూ కలిసి కావలి, నెల్లూరులోని ఏటీఎంలకు వచ్చే అమాయకులను టార్గెట్ చేసి నగదు తస్కరించేవారు. తమ వద్ద ఉంచుకున్న 12 ఏటీఎం కార్డులతో ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఏటీఎంలకు వెళ్లే వారు. ఎవరైనా వచ్చి నగదు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతుంటే వారి సాయం చేసినట్టు నటించేవారు. వారి పాస్‌వర్డ్‌ను కనుక్కుని, నగదు డ్రాచేసేవారు. వారు గమనించేలోగానే మళ్లీ కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టేవారు. సంబధిత వ్యక్తి వెళ్లిపోగానే తమ పనికానిచ్చేవారు. ఈ క్రమంలో కావలిలోని ఓ ఏటీఎం నగదు డ్రాచేసేందుకు వెళ్లానని, తర్వాత చూడగా తన ఖాతాలోని సుమారు రూ.20 వేలు డ్రాఅయినట్టు మెసేజ్ వచ్చిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కావలి ఒకటో పట్టణ పోలీసులు ఏటీఎంపై నిఘా పెట్టారు. సాయిగుప్తా అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగాపై విషయాలు వెల్లడించారు. ఈ విద్యార్థి తన అత్తమ్మకు చెందిన ఏటీఎం కార్డుతో సైతం ఇలాగే నగదు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాయిగుప్తా వద్ద వివిధ బ్యాంకులకు సంబంధించిన 12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.