ఇలా తెరిచారు... అలా అయిపోయాయి! | ATMs dried up within short time of opening, owes continue | Sakshi
Sakshi News home page

ఇలా తెరిచారు... అలా అయిపోయాయి!

Published Fri, Nov 11 2016 12:34 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

ఇలా తెరిచారు... అలా అయిపోయాయి! - Sakshi

ఇలా తెరిచారు... అలా అయిపోయాయి!

పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిరోజు ఏటీఎంలు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అలా వెంటనే మూతపడ్డాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిరోజు ఏటీఎంలు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అలా వెంటనే మూతపడ్డాయి. చాలావరకు ఏటీఎంలలో ఉదయమే నాట్ వర్కింగ్ అని, నో సర్వీస్ అని బోర్డులు వెలిశాయి. ఒకటీ అరా అక్కడక్కడ తెరుచుకున్నాయి గానీ, వాటిలో గట్టిగా పది పదిహేను మంది డబ్బులు తీసుకున్నారో లేదో.. వాటిలో డబ్బులు అయిపోయాయి. ఏటీఎం మిషన్లలో చాలావరకు వంద, యాభై రూపాయల నోట్లనే పెట్టడంతో, ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు తీసుకోవడంతో అవి త్వరగానే అయిపోయాయి. మళ్లీ వాటిలో డబ్బులు నింపాలంటే ఏజెన్సీల వాళ్లకు తలప్రాణం తోకకు వస్తోంది. 
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement