11 మందిని పెళ్లిచేసుకున్న యువతి...
11 మందిని పెళ్లిచేసుకున్న యువతి...
Published Sat, Sep 9 2017 11:54 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
థాయ్ లాండ్: కట్న,కానుకల కోసం మోసం చేస్తూ రెండు, మూడు పెళ్లిలు చేసుకునే యువకుల వార్తలు విన్నాం. కానీ ఓ థాయ్ లాండ్ యువతి ఏకంగా 11 మంది యువకులను పెళ్లి చేసుకుంది. థాయ్ లాండ్ సాంప్రదాయం ప్రకారం పెళ్లికొడుకే పెళ్లికూతురికి ఎదురు కట్నం ఇవ్వాలి. దీన్ని అవకాశంగా మలుచుకున్న జారియాపోర్న్ బుయాయి(32) రెండు సంవత్సరాల్లో 11 మంది యువకులను పెళ్లాడి వాళ్ల చెవుల్లో పువ్వులు పెట్టింది. ఒక్కో యువకుడి నుంచి సుమారు రూ.3లక్షల నుంచి రూ.19 లక్షల వరకు కట్నంగా తీసుకొంది ఈ లేడీ.
పెళ్లి అనంతరం పండ్ల వ్యాపారం చేయాలని, జాతకాలు కలవలేదని నమ్మబలకుతూ వారిని వదిలించుకుంటుంది. ఇక ఆమె బాధిత వరుల్లో ఒకరు ఫేస్ బుక్ లో ఈ కిలాడీ మోసాన్ని వివరిస్తూ హెచ్చరిక పోస్టు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం 11 మంది బాధితులు యువతిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని, ఒక ఆగస్టులోనే నాలుగు పెళ్లిలు చేసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. బాధితుల నుంచి మొత్తం రూ.60 లక్షల రాబట్టిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ యువతి తొలుత ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంటుంది. అనంతరం వారితో సెక్సులో పాల్గొని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. పెళ్లి అయిన అనంతరం డబ్బులతో ఉడాయిస్తుందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ యువతి బాధిత వరడు ఒకరు ఆమెను 'ది రన్ వే బ్రైడ్' గా అభివర్ణించాడు. ఫేస్ బుక్ లో పరిచయంతో శృంగారంలో పాల్గొన్న కొద్ది రోజుల తర్వాత గర్భం దాల్చినట్లు నమ్మబలికి పెళ్లి చేసుకొని మోసం చేసిందని మరో బాధితుడు పేర్కొన్నాడు.
Advertisement
Advertisement