16 మంది భారతీయుల తరలింపు | 16 Indians stranded in Iraq moved out, one of the 40 abducted escapes | Sakshi
Sakshi News home page

16 మంది భారతీయుల తరలింపు

Published Sat, Jun 21 2014 2:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

16 మంది భారతీయుల తరలింపు - Sakshi

16 మంది భారతీయుల తరలింపు

* కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న భారతీయుడు
* ఇరాక్‌లో పరిస్థితిపై ప్రధాని సమీక్ష
* భారత పౌరుల్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం: కేంద్రం

 
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బాగ్దాద్:
ఇరాక్‌లోని కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకుపోరుున భారతీయుల్లో 16 మందిని ఆయూ ప్రాంతాల నుంచి బయటకు తరలించారు. మరోవైపు మోసుల్ పట్టణంలో కిడ్నాప్‌కు గురైన 40 మంది భారతీయుల్లో ఒకరు మిలిటెంట్ల చెర నుంచి తప్పించుకున్నారు. ఇరాక్‌లోని భారత పౌరుల్ని రక్షించేందుకు అన్ని తలుపులూ తడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కిడ్నాప్ అరుున వారి విషయంలో, తిక్రిత్‌లో చిక్కుకుపోరుున 46 మంది నర్సుల విషయంలో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో.. సంక్షోభ పరిష్కారానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నామని, ఇరాక్ అధికారులతో పాటు ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్రం పేర్కొంది. ఇరాక్‌లో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉన్నతస్థారుు సమీక్ష నిర్వహించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలువురు ఉన్నతాధికారులు, భద్రత.. నిఘా విభాగాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  కిడ్నాప్‌కు గురైన వారంతా క్షేమంగానే ఉన్నట్టు, సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
 
 కాగా అన్బర్, బైజీ ప్రాంతాల నుంచి బయటపడిన 16 మందిని ఇరాక్ నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు.సున్నీ మిలిటెంట్ల స్వాధీనంలో ఉన్న తిక్రిత్‌లోని 46 మంది నర్సులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఇరాక్ నుంచి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న వారికి ఆర్థిక సహాయం చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ మేరకు వీసా నిబంధనలు సడలించాలని కూడా ఇరాక్‌కు విజ్ఞప్తి చేసిం ది. చిక్కుకున్న భారతీయులను ముఖ్యంగా తెలంగాణ వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్రాన్ని కోరారు. మిలిటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్ వెళ్లబోవని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement