
ఒక్కరోజుకి 30 లక్షల హిట్లు
వాషింగ్టన్: యూట్యూబ్‌లో విడుదలైన ఒక్కరోజులోనే 'డెడ్‌పూల్' చిత్రం ట్రైలర్‌కు 30 లక్షల హిట్లు వచ్చాయి. టిమ్ మిల్లర్ దర్శకత్వంలో ర్యాన్ రెనాల్డ్స్ మొరినా బొకారిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. ట్వంటీయత్ ఫాక్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
విడుదలైన తొలి రోజే ఈ చిత్రం ట్రైలర్‌ను దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. హాలివుడ్ సూపర్ మ్యాన్ సిరీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూపర్ హీరోనే ప్రతినాయకుడైతే.. అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం 2016లో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం వెల్లడించింది.