
కార్లనిండా బాంబులతో రెచ్చిపోయారు
ఏడెన్: యెమెన్ లో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. సైనిక బలగాలే లక్ష్యంగా రెండు కారు బాంబు దాడులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలుకోల్పోయారు. ఇంకొందరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది.
దీంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది. ముకల్లా అనే నగరంలోని సైనిక శిబిరంలోకి అమాంతం బాంబులతో నింపిన కారుతో ఓ ఉగ్రవాది విరుచుకుపడగా మరో కారుతో నగరం నడిఒడ్డున మరో ఉగ్రవాది తెగబడ్డాడు. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతం చిన్నాభిన్నమై రక్తసిక్తంగా మారింది. ఒక ఇప్పుడు ఈ ప్రాంతంలో అల్ కాయిదా ప్రభావం ఎక్కువగా ఉండేది.