ఒళ్లంతా ట్యూమర్లు..40 ఏళ్లుగా నడవడం లేదు.. | 53-year-old recluse is plagued by a 6-stone tumour on his thigh that makes children 'scared' of him | Sakshi
Sakshi News home page

ఒళ్లంతా ట్యూమర్లు..40 ఏళ్లుగా నడవడం లేదు..

Published Fri, Oct 13 2017 6:36 PM | Last Updated on Sat, Oct 14 2017 1:12 AM

53-year-old recluse is plagued by a 6-stone tumour on his thigh that makes children 'scared' of him

ఢాకా: గత 40 ఏళ్లుగా నడవడం లేదు.. కూర్చోవలన్నా.. బయటికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. వింత జబ్బుతో ఒళ్లంతా ట్యూమర్లు.. అతనిని చూస్తేనే చిన్న పిల్లలు దడుసుకుంటున్నారు. అతని కుడి తొడకైన భారీ కణితి నడవలేని స్థితి, కూర్చోలేని పరిస్ధితిని తీసుకొచ్చింది. చావలేక బతకలేక.. కుటుంబానికి భారమైన 53 ఏళ్ల హరూన్‌ పట్వారీ ధీన గాథ ఇది. బంగ్లాదేశ రాజధాని ఢాకాకు 90 మైళ్ల దూరంలో ఉన్న చంద్‌పూర్‌ జిల్లాలోని  నారయణ్‌పూర్‌ అనే మారుమూల గ్రామం హరూన్‌ పట్వారీది. ఇతనికి  భార్య జైతూన్‌ నిసా(49) ఇద్దరు పిల్లలు. ఎలాంటి పనిచేయలేని, కనీసం తన పనైన చేసుకోలేని హరూన్‌ను బతికించడం కోసం ఆ ఇద్దరు పిల్లలు కూలీలయ్యారు.

హరూన్‌కు  9 ఏళ్ల వయసు నుంచే శరీరమంతా ట్యూమర్లు రావడం ప్రారంభమయ్యాయి. నిరక్ష్యరాస్యత, పేదరికం అతని వ్యాధిని మరింత ముదిరేలా చేశాయి. అతని తల్లితండ్రులు చేయించిన వైద్యం బెడిసి కొట్టింది. ఒళ్లంతా చిన్న చిన్నగా ఉన్న ట్యూమర్లలో తొడ కున్న ట్యూమర్‌ పెరుగుకుంటూ వచ్చి అతన్ని పూర్తిగా నడవకుండా చేసింది. 

33 ఏళ్ల నుంచి అతని బాధను చూస్తున్నానని, అతను ఇలా జీవించడం చూస్తే గుండె తరుక్కుపోతుందని హరూన్‌ భార్య జైతూన్‌ నిసా ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఇలా బ్రతకడం నరకంలా ఉందని, బయటికి వెళ్తే చిన్నారులు భయపడుతున్నారని, దీంతో నేను ఎక్కడికి వెళ్లలేక పోతున్నానని హరూన్‌ తన సమస్యను తెలియజేశాడు. కానీ కొంత మంది యువకులు సాయం చేశారని, కొన్నేళ్లుగా ఆహారం, డబ్బులు ఇస్తూ అండగా నిలిచారన్నాడు. ఇప్పుడు నా స్వశక్తి మీద బతుకాలనుకుంటున్నానని, నాకేదైన సాయం చేయాలని హరూన్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు.

అండగా నిలిచిన సోషల్‌ మీడియా ..
హరూన్‌ ధీనగాథ తెలుసుకున్న మమూన్‌ అనే సామాజిక కార్యకర్త, సోషల్‌ మీడియా వేదికగా విరాళాలు సేకరించారు. అతని ధీన గాథను సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసి అండగా నిలిచారు. అతను వైద్య చికిత్స మాత్రమే అడగడం లేదని, మళ్లీ తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాడని మమూన్‌ పేర్కొన్నారు. ప్రజల నుంచి సానూకూలత వ్యక్తం అవుతోంది. త్వరలోనే అతను మూములు మనిషి అవుతాడని మమూన్‌ తెలపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement