ఇండోనేసియాలోని సుమత్రా దీవులను భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది.
ఇండోనేసియాలోని సుమత్రా దీవులను భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.25 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం తీరప్రాంతాన్ని గట్టిగానే తాకిందని అమెరికా సిస్మాలజిస్టులు చెబుతున్నారు. భూకంప కేంద్రం పడాంగ్ నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతున ఉంది.
భూకంపం వచ్చే సమయానికి ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. దీనివల్ల ఏమైనా ఆస్తినష్టం, ప్రాణనష్టం ఉన్నాయా లేవా అన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. ఇండోనేసియాలో తరచు భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు పేలడం లాంటివి జరుగుతుంటాయి.