
పపువా న్యూ గినియాకు 663 కోట్ల రుణం
పోర్ట్ మోర్స్‌బీ: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాకు భారత్ శుక్రవారం రూ. 663 కోట్లు రుణ సాయం ప్రకటించింది. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆ దేశాధ్యక్షుడు మైఖేల్ ఓగియోల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రోజుల పపువా న్యూగినియా పర్యటన ముగింపు సందర్భంగా ప్రణబ్, ఓగియోలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తమ దేశంలో విస్తారంగా ఉన్న చమురు, సహజ వాయువు వనరులను భారత్‌తో కలసి అన్వేషించి అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. ద్వైపాక్షిక తీర భద్రత చర్యల హామీలో భాగంగా నిఘా రాడార్ వ్యవస్థ, కోస్ట్‌గార్డ్ నిఘా పడవలను భారత్ ఇవ్వనుంది.
గాంధీజీ సందేశం నేటికీ స్ఫూర్తిదాయకం
అసహనం, తీవ్రవాదంతో విసిగిపోయిన నేటి ప్రపంచానికి మహాత్మా గాంధీ బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ప్రణబ్ పేర్కొన్నారు. పపువా న్యూగినియా వర్సిటీ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.