బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన కేంబ్రిడ్జ్ ఎనలిటికా మాజీ ఉద్యోగి
లండన్ : 8.7 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా చౌర్యానికి గురైందని కేంబ్రిడ్జ్ ఎనలిటికా మాజీ ఉద్యోగి వెల్లడించారు. మంగళవారం బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన సంస్థ మాజీ ఉద్యోగి బ్రిటనీ కైసర్‌పై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. పలు యాప్‌లు, సర్వేల ద్వారా కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎఫ్‌బీ యూజర్ల డేటాను సంగ్రహించేందని, యూజర్ల నుంచి డేటాను రాబట్టే విధంగా సైకాలజీ, డేటా సైన్స్ బృందాలు కలిసి సర్వేలో ప్రశ్నావళిని రూపొందిస్తాయని ఆమె పార్లమెంటరీ కమిటీకి నివేదించారు.
ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటాను విక్రయిస్తోందనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్‌బుక్‌కు కైసర్ వెల్లడించిన అంశాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫేస్‌బుక్ వెలుపల సైతం తమ సంస్థ ప్రజల నుంచి సమాచారం సేకరిస్తుందని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత వారం అమెరికన్ కాంగ్రెస్ విచారణలో అంగీకరించిన సంగీతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment