మెక్సికో : మెక్సికోలోని డ్యూరాంగో స్టేట్‌లో మంగళవారం సాయంత్రం ఎరోమెక్సికోకు చెందిన విమానం కూలిపోయింది. డ్యూరాంగో అంతర్జాతీయ విమానశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, 80 మందికి చిన్నపాటి గాయాలైనట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డ్యూరాంగో ఆరోగ్య శాఖ వెల్లడించిది. ప్రమాద సమయంలో విమానంలో 97 మంది ప్రయాణికులతో పాటు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే ప్రమాదం జరగడంతో సిబ్బంది వెంటనే సహాయక చర్యలను చేపట్టారు.
విమానంలో ఒక్కసారిగా పొగ ఆవరించడంతో తాము ఆందోళన చెందామని ప్రయాణికులు తెలిపారు. దీంతో తాము బయటపడేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిన తాము ప్రాణలతో ఉన్నామంటే నమ్మలేకపోతున్నామన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పెద్ద శబ్దం వచ్చినట్టు ప్రతక్ష సాక్ష్యులు తెలిపారు. దీనిపై ఎయిర్ మెక్సికో అధికారులు స్పందిస్తూ.. దీనికి తాము చింతిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment