aeromexico flight
-
కుప్పకూలిన విమానం
డ్యురాంగో: భారీ వడగళ్ల వానకు ఉత్తర మెక్సికోలో ఏరోమెక్సికోకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. డ్యురాంగో నుంచి మెక్సికోకు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వడగళ్ల వానలో విమానం చిక్కుకుంది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో విమానం కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 99 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది కలిపి మొత్తం 103 మంది అందులో ఉన్నారు. వారిలో 97 మందికి గాయాలయ్యాయి. పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. విమాన సిబ్బంది ఎంతో చాకచక్యంగా, నేర్పరితనంతో విమానాన్ని భారీ ప్రమాదం నుంచి తప్పించారని ఎయిర్లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆండ్రెస్ కొనేసా అభినందించారు. విమానం భద్రతా ప్రమాణాల వల్లే.. ఏరోమెక్సికో విమాన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడానికి కారణం దాన్ని తయారుచేసిన విధానం, భద్రతా ప్రమాణాల వల్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం లోపలి భాగాలు మంటలు అంటుకుని కాలిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కాకపోవడం వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
కుప్పకూలిన విమానం
-
‘ఇది నమ్మలేకపోతున్నాం’
మెక్సికో : మెక్సికోలోని డ్యూరాంగో స్టేట్లో మంగళవారం సాయంత్రం ఎరోమెక్సికోకు చెందిన విమానం కూలిపోయింది. డ్యూరాంగో అంతర్జాతీయ విమానశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, 80 మందికి చిన్నపాటి గాయాలైనట్టు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డ్యూరాంగో ఆరోగ్య శాఖ వెల్లడించిది. ప్రమాద సమయంలో విమానంలో 97 మంది ప్రయాణికులతో పాటు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఎయిర్పోర్ట్ సమీపంలోనే ప్రమాదం జరగడంతో సిబ్బంది వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. విమానంలో ఒక్కసారిగా పొగ ఆవరించడంతో తాము ఆందోళన చెందామని ప్రయాణికులు తెలిపారు. దీంతో తాము బయటపడేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిన తాము ప్రాణలతో ఉన్నామంటే నమ్మలేకపోతున్నామన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పెద్ద శబ్దం వచ్చినట్టు ప్రతక్ష సాక్ష్యులు తెలిపారు. దీనిపై ఎయిర్ మెక్సికో అధికారులు స్పందిస్తూ.. దీనికి తాము చింతిస్తున్నామని తెలిపారు. -
ఆ సిక్కు నటుడికి ఎయిర్ లైన్స్ క్షమాపణ
న్యూయార్క్: ఎయిర్ పోర్టులో అవమానానికి గురైన సిక్కు నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాకు ఎరోమెక్సికో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల క్రితం మెక్సికో ఎయిర్ పోర్టులో తలపాగా విప్పని కారణంగా సిక్కు నటుడిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. ఈ విషయమై అతనికి కలిగిన అసౌకర్యానికి ఆ అధికారులు విచారం వ్యక్తం చేస్తూ క్షమించమని కోరారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై కాస్త స్పష్టత తీసుకొచ్చారు. ప్రయాణికుల మత విశ్వాసాలను గౌరవించాలని, అన్ని మతాల వారిని ఒకేతీరుగా చూడాలని ఎరో మెక్సికో అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీ అంశాలపై జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రయాణికులను అగౌరవపరచరాదని సిబ్బందికి సూచించింది. న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి మంగళవారం పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కచ్చితంగా పాల్గొనాలని, తాను లేకపోతే షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా ఎరోమెక్సికో ప్రయాణికులతో ప్రవర్తించాల్సిన అంశాలపై కొన్ని ప్రకటనలు జారీచేస్తూ నటుడు వారిస్ అహ్లువాలియాకు క్షమాపణలు తెలిపారు. -
సిక్కు నటుడికి చేదు అనుభవం
మెక్సికో: సిక్కు జాతీయుడికి మెక్సికో ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాను మెక్సికో ఫ్లైట్ సిబ్బంది మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. ఆ నటుడు మెక్సికో నుంచి న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే, తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. ఈ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి సిద్ధమైన సిక్కు వ్యక్తి ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి జాత్యహంకారానికి గురయ్యాడు. తాను లేకపోతే న్యూయార్క్ లో ఫ్యాషన్ షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. యూఎస్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు సెక్యూరిటీ నిమిత్తం కొన్ని రూల్స్ పాటించాలని సోమవారం తమకు ఆదేశాలు వచ్చాయని మెక్సికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని... ప్రయాణికుల మత విశ్వాసాలను పక్కనబెట్టి నిబంధనలు పాటించడమే తమ బాధ్యత అని ఎయిర్ లైన్స్ అధికారులు వివరించారు.