85 ఏళ్ల తర్వాత భగత్‌సింగ్ కేసు విచారణ
లాహోర్: బ్రిటీష్ పోలీసు అధికారి శాండర్స్ హత్యకేసులో విప్లవవీరుడు భగత్ సింగ్ నిర్దోషి అంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం నుంచి లాహోర్ హైకోర్టు విచారించనుంది. పాక్‌లోని భగత్ స్మారక ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి ఈ పిటిషన్ వేశారు. ‘శాండర్స్ కేసులో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత భగత్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులపై నేరం మోపారు. ఈ కేసులో వీరు జీవితఖైదు అనుభవిస్తుండగానే.. కావాలనే వేరే కేసులో ఇరికించి వీరికి ఉరిశిక్ష అమలు చేశారు’ అని ఖురేషి పేర్కొన్నారు.