హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం! | Aircraft to fly the helicopter to take off | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

Published Tue, May 5 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

హెలికాప్టర్‌లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది. ‘గ్రీస్డ్ లైట్నింగ్ లేదా జీఎల్-10(అంటే మెరుపు వేగం)’ అని పేరుపెట్టిన ఈ విమానానికి రెక్కలపై 8, తోక వద్ద 2 మొత్తం పది ఇంజిన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ, డీజిల్‌తోనూ నడుస్తుంది.


6.1 మీటర్ల పొడవున్న రెక్కలతో ప్రాథమిక నమూనాగా తయారుచేసిన ఈ బుల్లి డ్రోన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరీక్షించగా, హెలికాప్టర్ కన్నా నాలుగు రెట్లు సమర్థంగా ప్రయాణించింది. వ్యవసాయ పర్యవేక్షణకు, నేలను మ్యాపింగ్ చేయడానికి, ఇతర పనులకు జీఎల్-10 ఉపయోగపడనుందని నాసా వెల్లడించింది. నాలుగు సీట్లుండే ప్రైవేటు విమానంగానూ దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement