the helicopter
-
హెలికాప్టర్లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!
హెలికాప్టర్లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది. ‘గ్రీస్డ్ లైట్నింగ్ లేదా జీఎల్-10(అంటే మెరుపు వేగం)’ అని పేరుపెట్టిన ఈ విమానానికి రెక్కలపై 8, తోక వద్ద 2 మొత్తం పది ఇంజిన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ, డీజిల్‌తోనూ నడుస్తుంది. 6.1 మీటర్ల పొడవున్న రెక్కలతో ప్రాథమిక నమూనాగా తయారుచేసిన ఈ బుల్లి డ్రోన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరీక్షించగా, హెలికాప్టర్ కన్నా నాలుగు రెట్లు సమర్థంగా ప్రయాణించింది. వ్యవసాయ పర్యవేక్షణకు, నేలను మ్యాపింగ్ చేయడానికి, ఇతర పనులకు జీఎల్-10 ఉపయోగపడనుందని నాసా వెల్లడించింది. నాలుగు సీట్లుండే ప్రైవేటు విమానంగానూ దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపింది. -
పరి‘శ్రమే’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మూడు హెలికాప్టర్లు.. పలువురు ఫార్మారంగ దిగ్గజాలతో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ముచ్చర్లలో 11వేల ఎకరాల్లో ఔషధనగరి నిర్మించనున్నట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో భూమిని సర్వే చేసి టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దాదాపు నాలుగు నెలలైనా ఈ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ల్యాండ్ బ్యాంక్ : 69,669 ఎకరాలు ఐటీ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర క్లస్టర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇబ్బడిముబ్బడిగా భూములను సమీకరించింది. జిల్లావ్యాప్తంగా 69,669 ఎకరాలను గుర్తించిన అధికారులు.. వీటిని మూడు భాగాలుగా విభజించారు. వీటిని ఇతర అవసరాలకు కాకుండా పూర్తిగా పారిశ్రామిక అవసరాలకే నిర్దేశించారు. ఖాళీ భూముల లెక్కలు తీయాలని, వివిధ సంస్థలకు బదలాయించినా.. అట్టిపెట్టుకున్న స్థలాల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద భూమల వివరాలను తయారు చేశారు. ఖాళీ స్థలాలు లేవట! కొత్తగా ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్న ఔత్సాహికులకు పరిశ్రమలశాఖ షాక్ ఇచ్చింది. పరిశ్రమలు పెడతాం.. స్థలం చూపమని అభ్యర్థించిన 800- 1000 మంది ఔత్సాహికులకు రిక్తహస్తం చూపింది. పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు (ఐడీఏ), పారిశ్రామిక పార్కులు (ఐపీ)లలో ఖాళీ స్థలాల్లేవని తేల్చిచెప్పింది. టీఐఐసీ, రెవెన్యూ అధికారులు కొత్తగా స్థలాలు కేటాయిస్తే తప్ప ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. ఒకవైపు సమృద్ధిగా ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు కేటాయించకుండా అట్టిపెట్టుకోవడం గమనార్హం. -
దావణగెరెలో నమో సభకు సర్వం సిద్ధం
దావణగెరె, న్యూస్‌లైన్ : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు దావణగెరె సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రోడ్లు, సర్కిళ్లు బీజేపీ బంటింగ్స్, జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. యావత్ నగరమంతా నమోమయంగా మారింది. నమో భారత్ సమావేశం జరిగే దావణగెరె నడిబొడ్డున ఉన్న ఉన్నత పాఠశాల మైదానంలో భారీ వేదికను నిర్మించారు. సమావేశానికి వచ్చే వారి కోసం సుమారు లక్షకు పైగా ఆసనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేసవి ప్రారంభమైనందున సమావేశానికి వచ్చే కార్యకర్తలకు దాహర తీర్చేందుకు సుమారు 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేశారు. నగరంలో అలంకరించేందుకు 3.50 లక్షల టన్నుల బంటింగ్, వేలాది పార్టీ జెండాలను వినియోగించారు. నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు నాయకులు, మోడీ అభిమానులు వందలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీకి దావణగెరె, చిత్రదుర్గంతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి సుమారు 2.5 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేశారు. ఇప్పటికే జనాన్ని సమీకరించేందుకు నమో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు, నమో టీస్టాల్స్ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టడంతో భారీ సంఖ్యలో జనం తరలివస్తారని నేతలు చెబుతున్నారు. హెలికాప్టర్లో నమో రాక : హుబ్లీ నుంచి హెలికాప్టర్లో నగర శివార్లలోని జీఎంఐటీ హెలిప్యాడ్‌కు మంగళవారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. జీఎంఐటీ ఆవరణలో నిర్మించిన బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత జీ.మల్లికార్జునప్ప ప్రతిమకు పూలమాల వేస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన జూనియర్ కాలేజీని ఆయన ప్రారంభిస్తారు. 11.30 గంటలకు సమావేశం జరిగే మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 కు మంగళూరుకు హెలికాప్టర్లో బయలుదేరి వెళతారు. నరేంద్ర మోడీ సమావేశంలో ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సదానందగౌడ, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప, ఎంపీలు అనంతకుమార్, జీఎం సిద్దేశ్వర్ తదితరులు పాల్గొననున్నారు. గట్టి బందోబస్తు : నరేంద్ర మోడీ రాక సందర్భంగా నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నగరం చుట్టుపక్కల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు జాగిలాలు, సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు.