
ఊహకందని ఇర్మా కదలికలు
న్యూయార్క్ : హరికేన్ ఇర్మా.. చాలా ప్రమాదకరంగా ఉందని.. తీరం దాటే సమయంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందని నాసా ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఇర్మా కదలికలను గమనించడంతో పాటు రికార్డు చేశారు. ఫ్లోరిడా తీరంలో సముద్రం చాలా కల్లోలంగా ఉండడంతో పాటు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడడాన్ని వ్యోమగాములు ఫొటోలు తీశారు. హరికేన్ ఇర్మా సముద్రంలో ఎలా ఉందో? ఎంత బీభత్సంగా ప్రయాణిస్తున్న విధానాన్ని శుక్రవారం ఉదయం వీడియో తీసి నాసా కేంద్రానికివ్యోమగాయులు పంపారు. ఈ వీడియోలో ఇర్మా గమనాన్ని మీరు గమనించండి.