Irma
-
విధ్వంసం సృష్టిస్తున్న ఇర్మా
-
ఊహకందని ఇర్మా కదలికలు
-
ఊహకందని ఇర్మా కదలికలు
న్యూయార్క్ : హరికేన్ ఇర్మా.. చాలా ప్రమాదకరంగా ఉందని.. తీరం దాటే సమయంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందని నాసా ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఇర్మా కదలికలను గమనించడంతో పాటు రికార్డు చేశారు. ఫ్లోరిడా తీరంలో సముద్రం చాలా కల్లోలంగా ఉండడంతో పాటు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడడాన్ని వ్యోమగాములు ఫొటోలు తీశారు. హరికేన్ ఇర్మా సముద్రంలో ఎలా ఉందో? ఎంత బీభత్సంగా ప్రయాణిస్తున్న విధానాన్ని శుక్రవారం ఉదయం వీడియో తీసి నాసా కేంద్రానికివ్యోమగాయులు పంపారు. ఈ వీడియోలో ఇర్మా గమనాన్ని మీరు గమనించండి. -
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
-
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
సాక్షి, వాషింగ్టన్: ఇర్మా తుఫాన్ కరేబియన్ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. ప్రచండమైన గాడ్పులు, వర్షాలతో బుధవారం రాత్రి ఇర్మా తుఫాన్.. అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, 5 కేటగిరి తుఫాన్ తీవ్రతతో దూసుకుపోతున్న దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది. హరికేన్ ఇర్మా ధాటికి బార్బుడా ఛిన్నాభిన్నమైంది. 'బార్బుడా శిథిలమయంగా కనిపిస్తోంది. గృహసముదాయాలన్నీ ధ్వంసమయ్యాయి. బార్బుడా దీవి పూర్తిగా నేటమట్టమైంది' అని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మీడియాతో తెలిపారు. ఇర్మా తుఫాన్ ధాటికి బార్బుడా దీవిలో కనీసం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక చిన్నారి ఉంది. ఇక సెయింట్ మార్టిన్ దీవుల్లో ఈ తుఫాన్ ధాటికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. వైబ్రంట్ నైట్లైఫ్కు వేదిక అయిన సెయింట్ మార్టిన్ దీవిలో ఇర్మా పెనువిపత్తును సృష్టించిందని, 95శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. 1800 మంది జనాభా గల బార్బుడా దీవి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా సమూలంగా ధ్వంసమైందని, ఇక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ప్రధాని బ్రౌన్ పేర్కొన్నారు. ఇక్కడ ధ్వంసమైన నివాసాలు పునర్నిర్మించేందుకు ఎంతలేదన్న 150మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. -
‘డెయిరీ’లోకి ఆయిల్ ఇండియా
గౌహతి: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆయిల్ ఇండియా కంపెనీ పాల ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా అసోంలోని రెండు జిల్లాల్లో పాల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీ యోచిస్తోంది. గుజరాత్లోని అమూల్ తరహాలో అసోంలో పాల వ్యాపారంలోకి ప్రవేశించనున్నామని, కామధేను ప్రాజెక్ట్ పేరుతో ఈ కార్యకలాపాలను చేపట్టనున్నామని ఈ ఏడాది జూలైలోనే కంపెనీ సీఎండీ సునీల్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్(ఐఆర్ఎంఏ)తో కంపెనీ ఇటీవలనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.