అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది! | Amazon Delivery Woman Follows Hilarious Request Of A Child | Sakshi
Sakshi News home page

అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!

Published Thu, Jun 25 2020 8:28 AM | Last Updated on Thu, Jun 25 2020 9:10 AM

Amazon Delivery Woman Follows Hilarious Request Of A Child - Sakshi

వీడియో దృశ్యాలు

న్యూయార్క్‌ : అమెజాన్‌ డెలివరీ మెన్‌ కావచ్చు.. ఉమెన్‌ కావచ్చు, వాళ్ల పని ఆర్డర్‌ చేసిన వస్తువులను క్షేమంగా కస్టమర్‌ ఇంటి దగ్గరకు చేర్చటం మాత్రమే.. కస్టమర్లు చెప్పినట్లు చేయటం కాదు. కానీ, అమెరికాకు చెందిన ఓ డెలివరీ ఉమన్‌ మాత్రం ఓ చిన్నపిల్లాడు కోరిన విధంగా వస్తువును డెలివరీ చేసి నెటిజన్ల మనసులు గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, డెలావేర్‌కు చెందిన లిన్‌ డెబోరా స్టఫిరీ అనే మహిళ కొద్దిరోజుల కిత్రం తన కుమారుడి కోసం అమెజాన్‌లో ఓ వస్తువు ఆర్డర్‌ చేసింది. అయితే ఆ చిన్న పిల్లాడు తను చెప్పిన విధంగానే డెలివరీ చేయాలని ఆర్డర్‌ సందర్భంగా విన్నవించుకున్నాడు. దీంతో పిల్లాడి కోరికను కాదనలేకపోయిన ఓ డెలివరీ ఉమన్‌‌ చెప్పిన విధంగానే చేసింది. ( దొంగ‌త‌నం చేసిన మ‌రుస‌టి రోజే..)

ఇంటి ముందు పార్శిల్‌ పెట్టి ‘‘ అబ్రకదబ్ర’’ అని గట్టిగా అరిచింది. అనంతరం పరిగెత్తుకుంటూ అక్కడినుంచి వచ్చి వ్యానులోకి ఎక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ఆ డెలివరీ ఉమన్‌‌ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ డెలివరీ చేసే ప్రతీ వ్యక్తి మన కోరికల్ని మన్నించరు... ఇది చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి.. ఆమెకు ఎంప్లాయి ఆఫ్ ‌ది మంత్‌ అవార్డు ఇవ్వండి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( అందమైన జీవిత రహస్యం చెప్పిన సెహ్వాగ్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement