ప్రతీకాత్మక చిత్రం
అమెరికా అంటే అనేక విధాలుగా అగ్రదేశం. కానీ అక్కడ 15 ఏళ్ల లోపు పిల్లల మరణాలకు ప్రధానంగా కేన్సర్ కారణమవుతున్నది. 2003–2014 సంవత్సరాల మధ్య పది లక్షల మంది పిల్లల్లో 173.7 కేన్సర్ బాధితులను కనుగొన్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి రోగుల సంఖ్యలో హెచ్చతగ్గులు ఉంటున్నాయి. అలాగే వైద్యానికి అయ్యే ఖర్చు విషయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. రోగాల అదుపు, నివారణ కేంద్రం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి. ఈ బాధితులలో లుకేమియా సోకిన వారే ఎక్కువ. ఆ తరువాత స్థానం బ్రెయిన్ కేన్సర్‌దే. అమెరికా పశ్చిమ ప్రాంతంలో లుకేమియా కేసులు ఎక్కువ. ఇందులో కొన్ని కేసులను నయం చేయగలుగుతున్నారు. కానీ అందువల్ల కొంచెం ఎది గిన తరువాత ఇతర రుగ్మతలు వేధిస్తున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment