వాషింగ్టన్: ఇటీవల పాక్‌లో గృహనిర్బంధం నుంచి విడుదలైన ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా డిమాండ్ చేసింది. సయీద్ విడుదల పాక్ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తుందన్న సందేశాన్ని ఇస్తోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా శాండర్స్ మండిపడ్డారు. సయీద్‌ను వెంటనే మళ్లీ అరెస్ట్ చేసి విచారించాలన్నారు.
సయీద్ విడుదలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. దక్షిణాసియా విధానంలో భాగంగా అమెరికా పాక్‌తో నిర్మాణాత్మకమైన సంబంధాలను కోరుకుంటోందని శాండర్స్ తెలిపారు. ఇందుకోసం ఈ ప్రాంతంలో ఆశాంతిని రేకెత్తించే ఉగ్రసంస్థలను పాక్ నిర్మూలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హఫీజ్ సయీద్‌ను అమెరికా ఇంతకుముందే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. సయీద్ తలపై కోటి డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment