సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం | At least 25 people killed, 100 injured in hospital fire in southern Saudi Arabia, officials say | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం

Published Thu, Dec 24 2015 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం

 సౌదీ : సౌదీ అరేబియాలో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 25మంది దుర్మరణం చెందగా, మరో 100మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సౌదీలోని జజాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదం 25మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 

కాగా ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఆ మంటలు మెటర్నటీ వార్డుకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై  మీడియా ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా వివరాల కోసం అధికారులను సంప్రదించగా... ' ఆస్పత్రి ప్రమాద ఘటన ఇంతటితో ముగిసిపోయిందని, విచారణ జరుగుతోందని, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని' తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement