'భారత్కు ఆ హక్కు ఉంది'
ఢాకా: పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం దాడులు నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ సమర్థించింది. భారత్కు ఆ హక్కు ఉందని చెప్పింది. ప్రతి దేశానికి తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే, గౌరవించుకునే హక్కు ఉందని, దానికి భంగం కలిగించినప్పుడు ప్రతిఘటించే హక్కు కూడా ఉందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు.
'తన సార్వభౌమత్వానికి, నేలకు భంగం కలిగినప్పుడు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టే చట్టపరమైన హక్కు భారత్ ఉంది. దీనికి అంతర్జాతీయ సమాజం అంగీకారం కూడా ఉంది' అని అన్నారు. ప్రధాని హసీనా తరుపున ఆమె వ్యక్తిగత సలహాదారు ఇక్బాల్ చౌదరీ ఈ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ విషయంపై స్పందిస్తూ అది ద్వైపాక్షిక సమస్య అని అన్నారు. ఇది పరిష్కారం కాకుండా అవతలి వైపు(పాకిస్థాన్) నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.