'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు' | Barack Obama does not love America, Rudy Giuliani | Sakshi
Sakshi News home page

'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'

Published Fri, Feb 20 2015 6:17 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు' - Sakshi

'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'

వాషింగ్టన్:అగ్రరాజ్యం అమెరికాలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రిపబ్లికన్ పార్టీ టార్గెట్ చేసింది. అసలు బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియానీ విమర్శలు గుప్పించారు.  బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం కఠినంగా అనిపించినా..  ఇది వాస్తమని గిలియానీ అన్నారు. 

 

మన్ హట్టన్ లో  ఓ కార్యక్రమానికి నిధుల సమీకరణకు హాజరైన గిలియానీ.. ఒబామాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  బరాక్ ఒబామా అమెరికాను ప్రేమిస్తున్నారా? అనేది మనకు ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ ఆయన ముఖంలో దేశంపై ప్రేమ లేదనేది స్పష్టంగా కనబడుతోందన్నారు.  'నేను ఒబామా ముఖ కవలికల్ని బట్టి ఆయనకు దేశంపై ప్రేమ లేదనేది చెబుతున్నాను. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. ఆయన మిమ్మల్నీ ప్రేమించడం  లేదు. నన్ను కూడా ప్రేమించడం లేదు' అని మాజీ మేయర్ విమర్శనాస్త్రాలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement