వాషింగ్టన్: అమెరికా పోలీసుల దాష్టీకానికి మరో ఉదాహరణ ఇది. తనపై దాడి చేశాడని పోలీసు నల్లజాతి యువకుణ్ని(19) కాల్చి చంపిన ఘటన శుక్రవారం మేడిసన్‌లోని విస్కాన్సిన్‌లో జరిగింది. 'గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. లోపల ఘర్షణ జరుగుతున్నట్టు బయటకు శబ్దాలు వినిపించాయి. మా ఆఫీసర్ లోపలికి వెళ్లగానే అతనిపై కూడా ఆ వ్యక్తి దాడి చే శాడు. ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో ఆఫీసర్ రివాల్వర్‌తో కాల్చాడు' అని పోలీస్ చీఫ్ మైక్ కోవల్ తెలిపారు.