కాబూల్: ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్లో సోమవారం భారీ ఆత్మాహుతి కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో జరిగిన ఈ దాడిలో క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్నారని ప్రత్యక్ష సాక్షి అయిన ఓ వార్తా సంస్థ ఫోటో గ్రాఫర్ తెలిపారు. దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడిని ఆప్ఘన్ ఉన్నతాధికారులు దృవీకరించారు.
కాబూల్లో బాంబు పేలుడు
Published Mon, Feb 1 2016 3:36 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement