
మరోసారి రెచ్చిపోయిన బొకో హారమ్
నైజీరియా: ఉగ్రవాద సంస్థ బొకో హారమ్ మరోసారి రెచ్చిపోయింది. నైజీరియాలోని ఓ మార్కెట్ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించడంతో అక్కడ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ ఈ ప్రాంతంలో పర్యటించిన నాలుగు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఓ మహిళా ఉగ్రవాది కూడా ఈ బాంబుదాడికి ముందు తనను తాను పేల్చేసుకున్నట్లు సమాచారం. చనిపోయినవారిలో యువకులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బుహారీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1000మందికి పైగా అమాయకులు బలయ్యారు. బుహారీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బొకో హారమ్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గత ఆరునెలలుగా కృషి చేయడంతోపాటు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.