అమెరికా అత్యవసర విభాగం 911లో పనిచేస్తున్న ఆంటోనియా బండీ రోజులాగే ఇండియానాలో తన విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఒక చిన్నారి గొంతు. ‘నా మాటలు మీకు వినిపిస్తున్నాయా’ అంటూ ఓ పిల్లాడు చాలా బాధగా ప్రశ్నించాడు. పాపం ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో అని భావించిన ఆంటోనియా ‘ఆ వినిపిస్తున్నాయి.. చెప్పు’ అని అడిగింది. అప్పుడు ఆ చిన్నారి ఈ రోజు నిజంగా ‘నాకు చాలా చెడ్డ రోజు స్కూల్‌లో ఏం సరిగా జరగలేదు’ అన్నాడు. దాంతో మరింత ఆందోళన చెందింది ఆంటోనియా. ‘నువ్వు ఇంత బాధపడే సంఘటన ఏం జరిగింది స్కూల్‌లో చెప్పు’ అని అడిగింది.
అప్పుడు ఆ పిల్లాడు ‘ఈ రోజు స్కూల్‌లో నాకు టన్నుల కొద్ది హోం వర్క్ ఇచ్చారు. నిజంగానే ఇది చాలా బ్యాడ్ డే’ అన్నాడు. ఈ మాటలు వినడంతోనే ప్రమాదం ఏం లేదని ఊపిరి పీల్చుకుంది ఆంటోనియా. వెంటనే ‘మరి నేను నీకు ఏం సాయం చేయాల’ని ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్లాడు ‘నేను లెక్కల్లో చాలా పూర్. ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయలేకపోతున్నాను. సాయం చేస్తారా’ అని అడిగాడు. ఆ ప్లేస్‌లో మరొకరు ఉంటే ఆ పిల్లాడిని నాలుగు మాటలు తిట్టి ఫోన్ కట్ చేసేవారు. కానీ ఆంటోనియా అలా చేయలేదు. కాల్ కట్ చేసి సరాసరి ఆ కుర్రాడి ఇంటికి వెళ్లింది.
ఆమెను చూసి సంతోషించిన ఆ కుర్రాడు ‘నాకు 3/4 + 1/4 = ఎంతో తెలియడం లేదు’ అని చెప్పాడు. వెంటనే ఆంటోనియా అతనికి అర్థమయ్యేలా వివరించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. హోం వర్క్ పూర్తయ్యాక ఆ పిల్లాడు.. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టింనందుకు క్షమించండి’ అని కోరాడు. అందుకు ఆంటోనియా పర్వాలేదు.. ‘మేం ఉన్నది మీకు సాయం చేయడానికే. కానీ ఇక మీదట ఇలాంటి సమస్య వస్తే.. మీ టీచర్‌ని లేదా మీ తల్లిదండ్రులను అడుగు’ అని చెప్పి వెళ్లిపోయింది. ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆంటోనియా చేసిన పనిని అభినందిస్తున్నారు నెటిజన్లు.
Our dispatchers never know what the next call might be.They train for many emergency situations, homework help is not one they plan for. We don't recommend 911 for homework help but this dispatcher helped a young boy out and brightened his day.@PoliceOne @apbweb @wlfi @WTHRcom pic.twitter.com/w3qCYfJP7O
— LafayetteINPolice (@LafayetteINPD) January 25, 2019
Comments
Please login to add a commentAdd a comment