లండన్: బ్రెగ్జిట్ (యూరప్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)కు సంబంధించిన ఓ బిల్లుకు బ్రిటిష్ పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరెసా మే ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లైంది. ఈ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 290 ఓట్లు పడ్డాయి. బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని థెరెసా మే అన్నారు.
తదుపరి దశలో ఈ బిల్లును ఎంపీలు క్షుణ్నంగా పరిశీలిస్తారు. 1972 నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. అలాగే ఈయూ చట్టాలను ఈ బిల్లు యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) చట్టాలుగా మారుస్తుంది.
బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
Published Wed, Sep 13 2017 9:12 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
Advertisement
Advertisement