
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆమె పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత గ్రాహమ్ బ్రాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే నడుస్తోన్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో థెరిసా మే తీవ్రంగా విఫలమయ్యారని సొంత పార్టీ సభ్యులే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై వచ్చే వారం ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ ప్రధాని నిర్ణయం వీగిపోయిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రెండేళ్ల బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ మార్చి 29నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్‌లో ఆమె అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. ఒకవేళ మే రాజీనామా చేస్తే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment