న్యూఢిల్లీ : భారీ ఎత్తున్న కురుస్తున్న వర్షాలకు, వరద నీరు నదిలా పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం అంత తేలికేమీ కాదు. రవాణా వ్యవస్థ కూడా ఏమీ ఉండదు. తప్పనిసరిగా పెళ్లి వాయిదా వేసుకోవాల్సిందే. కానీ ఫిలిప్పీన్స్‌లో ఓ పెళ్లికూతురు చాలా సాహసమే చేసింది. తన పెళ్లి ఆగకూడదని, ఆ వరద నీటిలోనే ఎంతో సంతోషంగా చర్చి వరకు నడుచుకుంటూ వచ్చింది.
ప్రస్తుతం ఫిలీప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాగీ అనే తుఫాను ఆ దేశ రాజధాని మనీలాను వరదల్లో ముంచెత్తింది. దాని పక్కనున్న ప్రావినెన్స్‌లు కూడా ఈ వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దానిలో పెళ్లికూతురు ఏంజిల్స్ ప్రావినెన్స్ బులాక్యాన్ కూడా ఉంది. నదిలా పారుతున్న ఈ వరదల్లో పెళ్లి చేసుకోవడం అసాధ్యమే. కానీ ఆ పెళ్లి కూతురు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరద నీటిలోనే పెళ్లి వస్త్రాలతో చర్చికి నడుచుకుంటూ వచ్చింది. ఎంతో సంతోషంతో వరద నీటిలో నడుచుకుంటూ చర్చికి వచ్చిన ఆమెను, పెళ్లి కొడుకు పెళ్లి వేదికపై తీసుకొని వెళ్లాడు.
‘వరదలే వచ్చినా లేదా వర్షాలే పడినా.. ఏవీ నన్ను ఆపలేవు. ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకుంటాం. దాన్ని వాయిదా వేస్తామా? నేను ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా’ అని ఏంజిల్స్ మీడియాకు చెప్పింది. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వరద నీటిలో ఎలాంటి ఇబ్బందులు పడుకుండా మోకాలి వరకు ఉన్న పాయింట్లు వేసుకుని వచ్చారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియో, యూజర్ల మనసులను హత్తుకుంటోంది. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో ఇప్పటికే వేలసార్లు షేర్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment