మేకప్ తెచ్చిన తంటా.. బస్సులోంచి దించేశారు | British Asian teenage girl thrown off bus for too much makeup | Sakshi
Sakshi News home page

మేకప్ తెచ్చిన తంటా.. బస్సులోంచి దించేశారు

Published Tue, Dec 29 2015 7:09 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

మేకప్ తెచ్చిన తంటా.. బస్సులోంచి దించేశారు - Sakshi

మేకప్ తెచ్చిన తంటా.. బస్సులోంచి దించేశారు

లండన్: ఓ అమ్మాయి శృతిమించి మేకప్ వేసుకోవడం వల్ల ఊహించని కష్టం వచ్చింది. ఈ టీనేజర్కు జరిమానా వేయడంతో పాటు బస్సులోంచి దించేశారు.

ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో గతవారం 15 ఏళ్ల అమ్మాయి సినిమాకు వెళ్లేందుకు స్నేహితులతో కలసి బస్సు ఎక్కింది. ఆ అమ్మాయి తన వయసును బట్టి చిన్న పిల్లల టికెట్ తీసుకుంది. అయితే మహిళా బస్సు కండెక్టర్ ఈ టికెట్ చెల్లదని చెప్పింది. 15 ఏళ్ల అమ్మాయిలా కనిపించడంలేదని, చిన్న పిల్లలా ఉండటం కోసం ఎక్కువగా మేకప్ వేసుకున్నావని కండెక్టర్ వాదించింది. బస్సులోంచి దిగాలని ఆ అమ్మాయికి చెప్పింది. అంతేగాక 3500 రూపాయల జరిమానా విధించింది. తాను అబద్ధం చెప్పలేదని, అసలు వయసు చెప్పినా కండెక్టర్ నమ్మలేదని ఆ అమ్మాయి వాపోయింది. ఇలాంటి సంఘటన ఎదురవుతుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది. తన వయసును నిరూపించుకునేందుకు ఏవైనా సర్టిఫికెట్లు చూపాలని కండెక్టర్ అడిగిందని, వాటిని వెంటపెట్టుకుని వెళ్లరు కదా అని వాపోయింది. పాపం ఎక్కువగా మేకప్ వేసుకున్నందుకు ఆ అమ్మాయికి జరిమానాతో  పాటు నడక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement