ఐసిస్‌ చీఫ్‌ అంతానికి ‘కిల్‌ మిషన్‌’ | British special forces on 'kill not capture' mission for ISIS chief | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ చీఫ్‌ అంతానికి ‘కిల్‌ మిషన్‌’

Published Tue, Jan 10 2017 3:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

British special forces on 'kill not capture' mission for ISIS chief

లండన్‌: ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) చీఫ్‌ అబుబకర్‌ అల్‌ బాగ్దాదీని మట్టుబెట్టేం దుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలసి బ్రిటన్‌కు చెందిన స్పెషల్‌ ఎయిర్‌ సర్వీస్‌ (ఎస్‌ఏఎస్‌).. ‘కిల్‌ మిషన్‌’ను ప్రారంభిం చింది. ఈ మిషన్‌ ఎస్‌ఏఎస్‌ స్నైపర్స్‌ నేతృత్వంలో సాగనుండగా.. కోవర్టు దళాలు సిరియా, ఇరాక్‌లోని ఐసిస్‌ స్థావరాలను పర్యవేక్షించనున్నాయి. ‘ప్రస్తుతం ఐసిస్‌ చీఫ్‌ ప్రధాన టార్గెట్‌. అబు బకర్‌ను అంతమొందించేందుకు ఎస్‌ఏఎస్‌ తమ ఇన్నేళ్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని వినియోగిస్తోంది’ అని రక్షణ శాఖ అధికారి ‘డైలీ స్టార్‌’ పత్రికకు తెలిపారు. అబు బకర్‌ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం 25 మిలియన్‌ డాలర్లకు పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement