కాలిఫోర్నియా : లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పని సీరియస్‌గా చేస్తున్నప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఆటంకం కలిగించడం సహజమే. ఒక్కోసారి ఇలాంటి పనులు తమ ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉంటాయి. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్ మీటింగ్ జరుగుతుండగా తన పెంపుడు పిల్లిని చూపించి అభాసుపాలవ్వడమే గాక ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 20న చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగుచూసింది. (నాకు సచిన్ వార్నింగ్ ఇచ్చాడు..: గంగూలీ)
వాల్లెజో ప్లానింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్న క్రిస్ ప్లాట్జర్ జూమ్ ద్వారా ఆన్‌లైన్‌లో కమిషన్ మీటింగ్ నిర్వహించాడు. ఏడుగురు సభ్యులతో కలిసి మీటింగ్ బాగా జరుగుతున్న సమయంలో క్రిస్ ప్లాట్జర్ తన పిల్లిని చూపించి నవ్వాడు. అంతేగాక పక్కనే గ్రీన్ బాటిల్‌లో ఉన్న బీర్‌ను ఒక సిప్ తాగి మళ్లీ మీటింగ్ నిర్వహించాడు. అయితే వీడియోలో ఉన్న వారందరూ నవ్వుకున్నారే తప్ప ఏ ఒక్కరు ఇలా చేయడం ఏంటని ప్రశ్నించలేదు. అయితే ఒక చానెల్ ఇదంతా యూట్యూబ్‌లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. ఒక ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి పని చేయడమేంటని ప్లానింగ్ కమిషన్ యాజమాన్యం ప్లాట్జర్‌ను ఈ-మెయిల్ ద్వారా వివరణ కోరింది.
దీనిపై ప్లాట్జర్ ఈ-మెయిల్‌లో స్పందిస్తూ 'మీటింగ్‌లో భాగంగా అలా చేయడం తప్పే. నేను అది కావాలని చేయలేదు. అది నా మీదకు వచ్చేసరికి దానిని పక్కకి విసిరేయాల్సి వచ్చింది. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి. ఈ తప్పు నేను చేశాను కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఒక ప్రభుత్వ అధికార మీటింగ్‌లో ఇలా ప్రవర్తించడం ఏంటని వీడియో చూసిన ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment