మూడు పిల్లులు.. ఫన్నీ వీడియో(వైరల్‌) | Cats Funny Viral Video China | Sakshi
Sakshi News home page

మూడు పిల్లులు.. ఫన్నీ వీడియో(వైరల్‌)

Published Mon, Jun 10 2019 11:29 AM | Last Updated on Mon, Jun 10 2019 11:53 AM

Cats Funny Viral Video China - Sakshi

బీజింగ్‌ : మూడు పిల్లుల మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియోలో మాటలు లేవు కాబట్టి.. మామూలుగా పిల్లులు మాట్లాడలేవు కాబట్టి మన భాషలో ఆ వీడియోకు డబ్బింగ్‌ చేబితే ఎలా ఉంటుందో చూద్దాం..

నల్లపిల్లి, చారల పిల్లి : మన స్నేహాన్ని ఏ మనిషి విడదీయలేడు. మనది జన్మజన్మల స్నేహబంధం.
నల్లపిల్లి, చారలపిల్లి దగ్గరకు వచ్చిన గండుపిల్లి : నా ఏరియాలో దోస్తీ గీస్తీ నై చల్తా! అట్లాంటిది..( కింద పడుకుని ఉన్న రెండు పిల్లుల వైపు కోపంగా చూస్తూ)
చారల పిల్లి : అయ్య బాబోయ్‌! నేను జంప్‌!(వెనకాల ఉన్న గండుపిల్లిని చూడగానే)
నల్లపిల్లి : ఏంటి? భూకంపం గానీ వచ్చిందా?.. వీడు ఇలా పరిగెడుతున్నాడేంటి?( ఏం జరిగిందో అర్థంకాక తికమకపడుతూ..)
గండుపిల్లి : ఏందిరా ఇది నల్లోడా!
నల్లపిల్లి : అయ్యో! నువ్వా అన్నా! ఎప్పుడొచ్చావు? నేను నిన్ను చూన్నేలేదు. (వెనక్కి తిరిగి గండుపిల్లిని చూసిన తర్వాత)
గండుపిల్లి : ఎందుకు చూస్తావురా ఈ మధ్య నీ కళ్లు ఉట్టిమీదికెక్కినాయి. (నల్లపిల్లి వైపు కోపంగా చూస్తూ)
నల్లపిల్లి : నేను జంప్‌ అన్నో!!!!...

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement