జపాన్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ(జైకా) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని మౌలిక వసతులు, వనరులకు సంబంధించి చంద్రబాబు వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నట్లు బాబు పేర్కొన్నారు. జపాన్ కంపెనీల ఇండస్ట్రియల్ పార్క్ స్పెషల్ అధారిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఆయన జైకా ప్రతినిధులకు తెలిపారు.
అంతకుముందు ఇసుజ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీ శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉందని ఇసుజ ప్రతినిధులు బాబుకు తెలిపారు. ఇండియాలో ఇసుజ మార్కెట్ విస్తరించాలని ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు కోరారు. ఇసుజతో పాటు మరిన్ని కంపెనీలను తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ కృష్ణపట్నంలను లాజిస్టిక్ హబ్ లుగా మార్చాలనుకుంటున్నట్లు బాబు వారికి తెలిపారు. ఏపీలో ఎక్కువ మానవ వనరులు ఉన్నాయని, ఇతర దేశాలకంటే భారత్ లో పెట్టుబడులు లాభదాయకమని, ఏపీలో మరింత లాభదాయకమన్నారు. నిరంతరం విద్యుత్ పై వారం రోజుల్లోగా అనుమతులు మంజూరు చేస్తామని వారికి బాబు హామి ఇచ్చారు.