సిరియాలో రసాయనికదాడులు! | chemical gas attacks in two Syrian cities | Sakshi
Sakshi News home page

సిరియాలో రసాయనికదాడులు!

Published Wed, Aug 3 2016 11:02 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

సిరియాలో రసాయనికదాడులు! - Sakshi

సిరియాలో రసాయనికదాడులు!

డమాస్కస్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వైమానిక దాడులు జరుపుతున్న దేశాలు రసాయనికదాడులకు దిగుతున్నాయా.. అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇటీవల రష్యాకు చెందిన ఎమ్-8 హెలికాప్టర్ను సిరియాలో కూల్చివేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రెండు కెమికల్ దాడులు జరిగాయని, ఈ దాడులకు పాల్పడింది రష్యానే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్లోరిన్ గ్యాస్తో కూడిన గ్యాస్ సిలిండర్లను ఇడ్లిబ్ ప్రావిన్సులోని సారాకెబ్లో జనావాసప్రాంతాల్లో విడిచారని 'ఇడ్లిబ్ సివిల్ డిఫెన్స్' తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. మరో ఘటనలో.. మంగళవారం అలెప్పోలో జరిగిన రసాయనిక దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారని సిటీ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ హజౌరీ మీడియాతో వెల్లడించారు. అయితే.. ఉగ్రవాదులు రసాయనిక దాడులకు పాల్పడ్డారంటూ సిరియా ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనను విడుదలచేశాయి. రష్యా సైతం రసాయనిక దాడుల ఆరోపణలను తోసిపుచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement