చైనాకు మోదీ గుబులు
బీజింగ్: చైనాకు భారత్ గుబులు పట్టుకుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటనపై చైనా స్పందించింది. భారత్, జపాన్ దేశాలు తమ న్యాయసమ్మతమైన అంశాలను గౌరవిస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఆ రెండు దేశాల మధ్య సాధారణమైన సంబంధాలు ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించింది. 'ఇరుగుపొరుగు దేశాల మధ్య సాధారణ సంబంధాలు పెంపొందించుకుంటే మాకు ఎలాంటి సమస్య లేదు.
అదే సమయంలో ఆ సంబంధాలు పెట్టుకునే దేశాలు మరో పొరుగు దేశానికి సంబంధించిన న్యాయ సమ్మతమైన అంశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అలాగే భారత్, జపాన్ చేస్తాయని మేం భావిస్తున్నాం' అని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్ను గౌరవించాలని అటు జపాన్తోపాటు భారత్ కూడా బీజింగ్ను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్తో కలిసి భారత్ ఇదే తీరును కొనసాగిస్తే దైపాక్షిక వ్యాపార సంబంధాల్ని కోల్పోవాల్సి వస్తుందని చైనా మీడియా హెచ్చరించింది.