మా జోలికొస్తే ఊరుకోం: జిన్‌పింగ్
బీజింగ్: చైనా ఏ దేశంలోని ప్రాంతాన్నీ దురాక్రమించుకోదనీ, కానీ తన భూభాగాన్ని లాక్కోవాలని చూస్తే ఊరుకోదని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం చెప్పారు. పొరుగుదేశాలకు గట్టి సమాధానం చెబుతూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతోందంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)ని జిన్‌పింగ్ ప్రశంసించారు.
జూన్ నెల మధ్య నుంచి సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సిక్కిం గురించి నేరుగా ప్రస్తావించని జిన్‌పింగ్.. యుద్ధసన్నద్ధతపై దృష్టి పెట్టాలని ఆర్మీకి సూచించారు. పీఎల్‌ఏ 90వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.