యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్: చైనా మీడియా
న్యూఢిల్లీ: ఓ పక్క శాంతి సమన్వయంతో ముందుకెళ్లాలంటూనే చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యకు దిగింది. ముఖ్యంగా ఆ దేశ మీడియా గొడవను మరింత పెద్దది చేసేలా కథనాన్ని వెలువరించింది. ఇక భారతదేశంతో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని(కౌంట్ డౌన్ స్టార్ట్ టు మిలిటరీ యాక్షన్) అంటూ చైనా అధికార పత్రిక కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా ఈ వ్యాఖ్యలు బలపరిచేలా మాట్లాడారు.
ఢిల్లీ చేస్తున్న చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కశ్మీర్‌లోకి అడుగుపెట్టేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. డోక్లామ్ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. మరోపక్క, సమరానికి సమయం దగ్గరపడిందని, శాంతి ద్వారాలు మూసుకుపోయాయని, జరగబోయే పరిణామాలకు భారత్ పూర్తి బాధ్యత వహించాలంటూ చైనాకు చెందిన ఓ అధికార పత్రిక కథనం రాసింది.