12వేల కిలోమీటర్లు ప్రయాణించింది
న్యూఢిల్లీ: లండన్ నుంచి ఓ రైలు సుమారు 12వేల కిలోమీటర్లు(7500 మైళ్లు) ప్రయాణించి శనివారం చైనా చేరింది. ఈ ట్రైన్ దక్షిణ యూరప్ గుండా ప్రయాణించింది. సుమారు 15 ప్రధాన పట్టణాలను దాటకుంటూ వచ్చింది. దీనిపేరు ఈస్ట్ విండ్. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రైలు మార్గం. దీనికి సిల్కరోడ్ గా నామకరణం చేశారు
2013లో చైనా వన్ బెల్టు వన్ రోడ్ విధానంలో వివిధ మార్గాలను కలుపుకుంటూ అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగానే లండన్ నుంచి చైనాకు ఈ రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు విస్కీ బాటిళ్లు, పిల్లల పాలు, మందులు, యంత్రాలతో ఏప్రిల్10న లండన్‌లో బయలుదేరింది. ప్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ దేశాల గుండా 20 రోజుల ప్రయాణం అనంతరం తూర్పు చైనాలోని ఈవు పట్టణానికి శనివారం చేరుకుంది. దీనిలో సుమారు 88 షిప్ కంటెనర్లతో ప్రయాణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.