బీజింగ్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న పలు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా చైనా పరిశోధకులు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై పరీక్షల రెండో దశను ప్రారంభించారు. వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రతను పరిశీలించేందుకు రెండో దశ హ్యూమన్ ట్రయల్స్‌లో కీలక పరీక్షలు చేపడతామని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ(ఐఎంబీసీఏఎంఎస్) ఆదివారం వెల్లడించింది. ఈ పరీక్షలో వ్యాక్సిన్ ఆరోగ్యవంతుల్లో వ్యాధి నిరోధక వ్యవస్ధను ఎంతవరకూ ప్రేరేపిస్తోంది, ఎంత డోస్ ఇవ్వాలనే దానిపై పరిశోధకులు ఓ అంచనాకు రానున్నారు.
కాగా, చైనాలో వ్యాక్సిన్ సరఫరాలను పూర్తిస్ధాయిలో చేపట్టేందుకు ప్రత్యేక ప్లాంట్‌లో వ్యాక్సిన్ల తయారీ చేపడతామని ఐఎంబీసీఏఎంఎస్ వెల్లడించింది. ఇక మహమ్మారి కేసులు కరోనా వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా మారనుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరినాటికి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ గవోఫు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment