‘చెప్పులదండేసి సరిహద్దు చుట్టూ పరుగెత్తించాలి’ | Cleric Offers Rs 20 Lakh to Garland Sharif With Kulbhushan Shoes | Sakshi
Sakshi News home page

‘చెప్పులదండేసి సరిహద్దు చుట్టూ పరుగెత్తించాలి’

Published Sun, May 21 2017 8:29 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

‘చెప్పులదండేసి సరిహద్దు చుట్టూ పరుగెత్తించాలి’

‘చెప్పులదండేసి సరిహద్దు చుట్టూ పరుగెత్తించాలి’

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఎవరు కులభూషణ్‌ యాదవ్‌ చెప్పుల దండ వేస్తే వారికి రూ.20 ఇస్తానని కోల్‌కతాకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద ఆఫర్‌ చేశారు. అలాగే, దండ వేసిన వ్యక్తి షరీప్‌ భారత దేశం హద్దు చుట్టూ పరిగెత్తించాలని సూచించారు. ఇటీవల పెద్ద పెద్ద మైకులు పెట్టొద్దంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి సయ్యద్‌ షా అతీఫ్‌ అలీ అల్‌ క్వాదేరి జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కుల భూషణ్‌ జాదవ్‌ ఉపయోగించిన చెప్పులను, షూలను దండగా తయారుచేసి దాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్‌ ప్రధానీ నవాజ్‌ షరీఫ్‌ మెడలో వేసి ఎవరు అతడి భారత సరిహద్దు చుట్టూ పరుగెత్తిస్తారో వారికి రూ.20లక్షలు బహుమతిగా ఇస్తాను. పాకిస్థాన్‌ తాను ముస్లిం దేశం అని చెప్పుకుంటోంది. కానీ, ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం ప్రధాని తప్పకుండా చేయాల్సిన పని.కానీ, అతడు ఫెయిల్‌ అయ్యాడు’ అని ఆయన చెప్పారు. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement