kulbhushan yadav
-
పాక్ కపట నాటకం
-
‘చెప్పులదండేసి సరిహద్దు చుట్టూ పరుగెత్తించాలి’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఎవరు కులభూషణ్ యాదవ్ చెప్పుల దండ వేస్తే వారికి రూ.20 ఇస్తానని కోల్‌కతాకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద ఆఫర్ చేశారు. అలాగే, దండ వేసిన వ్యక్తి షరీప్ భారత దేశం హద్దు చుట్టూ పరిగెత్తించాలని సూచించారు. ఇటీవల పెద్ద పెద్ద మైకులు పెట్టొద్దంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి సయ్యద్ షా అతీఫ్ అలీ అల్ క్వాదేరి జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కుల భూషణ్ జాదవ్ ఉపయోగించిన చెప్పులను, షూలను దండగా తయారుచేసి దాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్ ప్రధానీ నవాజ్ షరీఫ్ మెడలో వేసి ఎవరు అతడి భారత సరిహద్దు చుట్టూ పరుగెత్తిస్తారో వారికి రూ.20లక్షలు బహుమతిగా ఇస్తాను. పాకిస్థాన్ తాను ముస్లిం దేశం అని చెప్పుకుంటోంది. కానీ, ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం ప్రధాని తప్పకుండా చేయాల్సిన పని.కానీ, అతడు ఫెయిల్ అయ్యాడు’ అని ఆయన చెప్పారు. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాక్ ఖైదీలను వదిలేది లేదు: భారత్
భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంతో.. భారత్ దీటుగా స్పందించింది. బుధవారం నాడు విడుదల చేయాల్సిన దాదాపు 12 మంది పాకిస్తానీ ఖైదీలను ఇక విడుదల చేసేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తానీ ఖైదీలను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. శిక్షా కాలాన్ని పూర్తిచేసుకున్న ఖైదీలను విడుదల చేసి, వారి స్వదేశాలకు పంపడాన్ని భారత్, పాక్ దేశాలు చాలాకాలంగా అమలుచేస్తున్నాయి. కులభూషణ్ జాదవ్ (46) గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించి.. ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్లు పాకిస్తాన ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా కూడా ధ్రువీకరించారు. కనీసం న్యాయం, చట్టాలకు సంబంధించిన ప్రాథమిక నియమాలను కూడా పాటించకుండా పాకిస్తాన్ ఇలా చేసిందంటూ భారత్ తీవ్రంగా మండిపడింది. భారతదేశంలో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ పిలిపించి, తీవ్రమైన పదజాలంతో ఒక ఖండన లేఖ ఇచ్చారు.