బీజింగ్: చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ బట్టబయలు కావడానికి 15 రోజుల ముందే పొంచి ఉన్న ఆ వైరస్ గురించి బంధు, మిత్రులను, తెలిసిన వారిని అప్రమత్తం చేసిన లీ వెన్‌లియాంగ్ అనే 34 ఏళ్ల డాక్టర్ అదే వైరస్ బారిన పడి శుక్రవారం తెల్లవారుజామున ‘వుహాన్ సెంట్రల్ హాస్పిటల్’లో దురదష్టవశాత్తు మరణించారు. ఆయన మరణం పట్ల ఆస్పత్రి సిబ్బంది దిగ్భ్రాంతిని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ‘కరోనా వైరస్ బారిన పడిన ఎంతో మంది రోగులకు చికిత్స అందించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్ కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. ఆయన్ని రక్షించేందుకు మేము చివరి నిమిషం వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఏడవ తేదీ తెల్లవారు జామున 2.58 నిమిషాలకు లీ వెన్‌లియాంగ్ ప్రాణం విడిచారు. బాధాతప్త హృదయాలతో మేము విచారాన్ని, నిజాయితీగా నివాళిని అర్పిస్తున్నాం’ అని ఆస్పత్రి సోషల్ మీడియా ‘వైబో’ వైద్యులు లిఖిత పూర్వకంగా తెలిపారు. (విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..)
1.40 కోట్ల మంది జనాభా కలిగిన వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో ‘సార్స్’ వైరస్ ఉందంటూ లీ వెన్‌లియాంగ్ డిసెంబర్ 30న సోషల్ మీడియా ద్వారా పరిచయస్థులందరిని హెచ్చరించారు. జనవరి 15న కరోనా వైరస్‌కు సంబంధించి తొలి వార్తలు వచ్చాయి. అది సీఫుడ్ మార్కెట్ నుంచి వ్యాపించినట్లు తెలుసుకొని జనవరి 20వ తేదీన దాన్ని అధికారులు మూసివేశారు. ఆప్తమాలజిస్ట్ అయిన లీ వెన్‌లియంగ్ హెచ్చరికలకు తీవ్రంగా పరిగణించి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉన్నట్లయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఆయన కరోనా వైరస్ అని చెప్పకుండా ‘సార్స్’ అని చెప్పారు. సార్స్ కూడా కరోనా వైరస్‌తో వచ్చేదే. కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 630 మంది మరణించగా, దాదాపు 30 వేల మందికి సోకింది. (భారతీయ శాస్త్రవేత్త కృషి..కరోనాకు వ్యాక్సిన్)
చదవండి:
కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు
కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్’
Comments
Please login to add a commentAdd a comment