న్యూయార్క్ : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ సోకినట్లు అక్కడక్కడా వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమా, అబద్ధమా తెలియక ప్రజలు గందరగోళంలో పడగా, దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వైద్యులు ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు. ఈ విషయంలో మొదటిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థనే నోరు విప్పింది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంతవరకు జరిపిన యాంటీ బాడీస్ (రోగ ప్రతిఘటనా) పరీక్షల్లో ఎక్కడ కూడా తమ రోగ నిరోధక శక్తి కారణంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ ఎపిడిమాలాజిస్ట్‌లు తెలిపారు. అందుకని ఒకసారి వైరస్ బారిన పడి కోలుకున్న వారు మళ్లీ వైరస్ బారిన పడరన్న గ్యారంటీ లేదని వారు చెప్పారు.
బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు 35 లక్షల రక్తం నమూనాల్లో యాంటీ బాడీస్ స్థాయిని పరీక్షించిందని, వాటిలో కరోన బారిన పడి కోలుకున్న వారి రక్తం నమూనాలను కూడా సేకరించిందని, అలా కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఎక్కువ ఉన్న దాఖలాలు కనిపించలేదని డాక్టర్ మరియా వాన్ ఈ రోజు జెనీవాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. యాంటీ బాడీస్ ఎక్కువ ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ బారిన పడి కచ్చితంగా కోలుకుంటారని కూడా చెప్పలేమని ఆమె తెలిపారు. పలు దేశాల నుంచి సేకరించిన రక్తం నమూనాలను పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం ధ్రువపడిందని ఆమె అన్నారు. ఈ కారణంగా ఒక్కసారి కరోనా బారిన పడి కోలుకున్నవారు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడరని కూడా చెప్పలేమని చెప్పారు.
ఇది చదవండి: వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైంది...
Comments
Please login to add a commentAdd a comment