దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు!
దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు!
Published Fri, Aug 9 2013 10:50 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
భారత దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ తొలిసారి నోరు విప్పింది. గతంలో దావూద్ పాకిస్థాన్ లో తల దాచుకున్నది వాస్తవమేనని.. ప్రస్తుతం యూఏఈలో ఉండవచ్చని పాక్ ప్రత్యేక రాయబారి షార్యార్ ఖాన్ వెల్లడించారు. ఒకవేళ పాకిస్థాన్ లో ఉంటే తాము అరెస్ట్ చేయాడానికైన వెనకాడబోమని ఆయన అన్నారు. అంతేకాకుండా దావూద్ లాంటి గ్యాంగ్ స్టర్ తమ దేశం నుంచి వ్యవహారాలను నడపడానికి అనుమతించమని అన్నారు.
ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రికెట్ కాల్ డ్రన్: ద టర్బలెంట్ పాలిటిక్స్ ఏవ స్పోర్ట్స్ ఇన్ పాకిస్థాన్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో షార్యార్ ఖాన్ పాల్గొన్నాడు. పాకిస్థాన్ తోపాటు ఇతర దేశాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించే క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతున్న కారణంగానే దావూద్ పాకిస్థాన్ వదలి వెళ్లి ఉండచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Advertisement
Advertisement