మాస్కో: చనిపోయిందని సమాధి చేసిన కుక్క తిరిగి తన యాజమానుల దగ్గరకు చేరింది. ఈ ఘటన రష్యాలోని నోవోనికోల్స్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... క్రై ప్రాంతంలో నివసించే ఇద్దరు అక్కాచెల్లెలు తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క(డిక్) నిద్రలో చనిపోయిందని భావించారు. చాలా సేపు డిక్‌లో ఎటువంటి చలనం లేకపోయేసరికి అది చనిపోయిందనే నిర్ధారణకు వచ్చారు. తాము అమితంగా ఇష్టపడే డిక్ తమ నుంచి దూరమైందని బాధపడ్డారు. తర్వాత దాన్ని దగ్గరలోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు.
అయితే అనుహ్యంగా కొంత సమయం తరువాత డిక్ ఆ మట్టిని తవ్వుకుంటూ పైకి చేరింది. ఒంటి నిండా మట్టితో ఉన్న కుక్కను ఆ పరిసరాల్లో తిరగడం గమనించిన కొందరు వ్యక్తులు దాన్ని దగ్గర్లోని పెట్ షెల్టర్‌కు తరలించారు. అక్కడ డిక్‌కు చిన్నపాటి చికిత్స అందించారు. పెట్ షెల్టర్ ఉద్యోగి ఒకరు డిక్ యాజమానులు ఎవరో తెలుసుకోవడానికి.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచారు. అయితే ఈ ఫొటోలు చూసిన డిక్ యాజమానులు తొలుత షాక్ గురయ్యారు. ఆ తరువాత డిక్ బతికే ఉందని తెలుసుకుని ఆనందపడ్డారు. ఆ తరువాత దానిని తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఈ సంతోష సమయంలో వారు ఆ పెట్ షెల్టర్‌కు 5,000 రూబెల్స్ డోనేషన్ ఇచ్చారు. ఈ ఘటనపై షెల్టర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. డిక్ యాజమానులు దానిని నిద్ర నుంచి లేపడంలో విఫలమయ్యారని తెలిపారు.. అయితే డిక్‌ను తక్కువ లోతులో పూడ్చటంతో అది ప్రాణాలు దక్కించుకోగలిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment